తెలంగాణ

telangana

ETV Bharat / business

జియో గుడ్​న్యూస్​: ఉచిత కాల్​ బ్యాలెన్స్​తో కొత్త ప్లాన్లు - jio new tariffs

రిలయన్స్ జియో నూతన టారిఫ్​లను ప్రకటించింది. 2 జీబీ ప్లాన్​తో ఉచితంగా ఇతర నెట్​వర్క్​లకు కాల్​ చేసేందుకు​ 1000 నిమిషాల బ్యాలెన్స్​ అందిస్తున్నట్లు తెలిపింది. ఇతర నెట్​వర్క్​లకు కాల్​ చేసేందుకు నిమిషానికి 6 పైసలు ఛార్జ్​ విధించడంపై విమర్శలు వ్యక్తమైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

జియో గుడ్​న్యూస్​: ఉచిత కాల్​ బ్యాలెన్స్​తో కొత్త ప్లాన్లు

By

Published : Oct 21, 2019, 3:16 PM IST

భారత్​లో డేటా విప్లవానికి నాంది పలికిన నెట్​వర్క్​ రిలయన్స్ జియో. ఇతర నెట్​వర్క్​లకు కాల్ చేసేందుకు నిమిషానికి 6 పైసలు వడ్డింపుతో వినియోగదారుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొందీ సంస్థ. కొంతమంది వినియోగదారులు జియోను వదిలేస్తున్న విషయాన్ని గమనించి నష్ట నివారణ చర్యల వైపు అడుగులు వేసింది. డేటాతో పాటు ఇతర నెట్​వర్క్​లకు కాల్​ చేసేందుకు ఉచితంగా వెయ్యి నిమిషాల బ్యాలెన్స్​ అందిస్తూ నూతన టారిఫ్ ప్లాన్లు ప్రకటించింది.

టారిఫ్​లు ఇవీ..

మూడు నెలలపాటు 2జీబీ డేటాను అందించే రూ. 448 ప్రణాళికను రూ. 444గా మార్చింది జియో. ఈ డేటాతో పాటు ఇతర నెట్​వర్క్​లకు కాల్​ చేసేందుకు రూ. 80 విలువ చేసే వెయ్యి నిమిషాలను ఉచితంగా అందించనుంది.

రెండు నెలల 2జీబీ డేటా ప్లాన్​ను రూ. 333కు..., రూ. 198 గా ఉన్న నెల రోజుల ప్లాన్​ను రూ. 222 కు మార్చింది జియో. ఈ ప్లాన్​లతో పాటు రూ. 80 విలువ చేసే వెయ్యి నిమిషాల ఇతర నెట్​వర్క్ నిమిషాలను అందించనుంది. ఈ ప్లాన్​తో జియో టూ జియో అపరిమిత ఉచిత కాల్స్ అదనం.

పోటీ నెట్​వర్క్​లతో పోలిస్తే తక్కువే..

నూతన టారిఫ్​ ధరలతో ఇప్పటికీ తామే దిగ్గజాలమని చాటుకుంటోందీ డేటా దిగ్గజం. ఇతర నెట్​వర్క్​లతో పోలిస్తే తక్కువ ధరల్లోనే ఈ టారిఫ్​లను అందిస్తోంది.
నెల రోజుల ప్లాన్​లో జియో నూతన టారిఫ్​ ధర రూ. 222 కాగా ఎయిర్​టెల్ రూ. 249కు 2 జీబీ డేటా, వొడాఫోన్ రూ. 255తో 2.5జీబీ డేటా అందిస్తున్నాయి. అయితే మిగతా నెట్​వర్క్​లు అపరిమిత ఉచిత కాల్స్ అందిస్తుండగా.. జియోలో వెయ్యి నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడాలనుకుంటే మాత్రం మరికొంత ధర చెల్లించక తప్పదు.

ఇదీ చూడండి: ఓటేసేందుకు హరియాణా సీఎం 'ఆకర్ష' ప్రయాణం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details