తెలంగాణ

telangana

ETV Bharat / business

మరో 13 అంతర్జాతీయ సర్వీసులకు 'జెట్​' బ్రేక్​

ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న జెట్​ ఎయిర్​వేస్​​ మరో 13 అంతర్జాతీయ సర్వీసులను ఏప్రిల్​ నెలాఖరు వరకు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. లీజు చెల్లించని కారణంగా ఇప్పటివరకు నిలిచిపోయిన విమానాల సంఖ్య 54కు చేరింది.

By

Published : Mar 23, 2019, 9:42 AM IST

Updated : Mar 23, 2019, 12:59 PM IST

జెట్

మరో 13 అంతర్జాతీయ సర్వీసులుకు 'జెట్​' బ్రేక్​
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన జెట్ ఎయిర్​వేస్​ మరో నిర్ణయం తీసుకుంది. 13 అంతర్జాతీయ సర్వీసులను ఏప్రిల్ నెలాఖారు వరకు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. లీజు చెల్లించని కారణంగా మరో 7 విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ఈ నిర్ణయం వల్ల అంతర్జాతీయ సర్వీసులకు ఆటంకం ఏర్పడింది.

ఇప్పటి వరకు నిలిచిపోయిన జెట్​ ఎయిర్​వేస్​ విమానాల సంఖ్య 54కు చేరింది.

సర్వీసుల రద్దుతో పాటు అంతర్జాతీయ ట్రిప్​లను తగ్గించినట్లు జెట్​ ఎయిర్​వేస్​ వర్గాలు పేర్కొన్నాయి. ముఖ్యంగా దిల్లీ, ముంబయి నుంచి ట్రిప్​ల సంఖ్య అధికంగా తగ్గించినట్లు సంస్థ తెలిపింది.

ఒకప్పుడు రోజుకు 600 విమానాలు నడిపిన జెట్​ఎయిర్​ వేస్​... ఆర్థిక సంక్షోభం వల్ల ప్రస్తుతం రోజుకు 119 విమానాలు మాత్రమే నడుపుతోంది.

Last Updated : Mar 23, 2019, 12:59 PM IST

ABOUT THE AUTHOR

...view details