తెలంగాణ

telangana

ETV Bharat / business

జెట్​ సంక్షోభంపై పీఎంఓ అత్యవసర భేటీ - pm

ఆర్థిక భారంతో సతమతమవుతోన్న జెట్​ఎయిర్​వేస్​ సంక్షోభంపై చర్చించేందుకు ప్రధానమంత్రి కార్యాలయం అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. శని, ఆది వారాల్లో కేవలం ఆరు నుంచి ఏడు విమానాలు మాత్రమే నడవనున్నట్లు జెట్​ ఎయిర్వేస్​ తెలిపింది. సోమవారం బ్యాంకర్ల కన్సార్టియంతో సమావేశం అనంతరం సంస్థ భవితవ్యం తేలనుంది.

జెట్​ సంక్షోభంపై పీఎంఓ అత్యవసర భేటీ

By

Published : Apr 13, 2019, 6:17 AM IST

జెట్​ సంక్షోభంపై పీఎంఓ అత్యవసర భేటీ

జెట్​ ఎయిర్​వేస్ వ్యవహారంపై అత్యవసర సమావేశం నిర్వహించింది ప్రధానమంత్రి కార్యాలయం. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న జెట్​ ఎయిర్​వేస్​ సమస్యలపై చర్చించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పౌరవిమానయాన శాఖ మంత్రి సురేశ్​ ప్రభు సూచన మేరకు ప్రధానమంత్రి కార్యాలయ అధికారి ప్రదీప్​ సింగ్ ఖరోలా ఈ సమావేశాన్ని నిర్వహించారు.

సమావేశ వివరాల్ని ఖరోలా వెల్లడించారు. శుక్రవారం జెట్​ ఎయిర్​వేస్ 11 విమానాల్ని మాత్రమే నడిపిందని ప్రకటించారు. శని, ఆదివారాల్లో ఆరు నుంచి ఏడు విమానాల్ని మాత్రమే నడిపేందుకు వీలవుతుందని స్పష్టం చేశారు. జెట్ ఎయిర్​వేస్ శుక్రవారం బ్యాంకర్లతో సమావేశమైంది. ఎస్​బీఐ నేతృత్వంలోని రుణదాతల కన్సార్టియం ప్రస్తుతం జెట్​ ఎయిర్​వేస్​ను నిర్వహిస్తోంది. శుక్రవారం జరిగిన సమావేశంలో ఏ నిర్ణయమూ వెలువడలేదు.

అవసరమైన నిధుల కోసం సోమవారం జెట్​ నిర్వాహకులు బ్యాంకర్లతో మళ్లీ సమావేశమౌతారు. అప్పటివరకూ కేవలం ఆరు నుంచి ఏడు విమానాలు మాత్రమే సేవలందిస్తాయి. అనంతర పరిణామాలు బ్యాంకర్లు తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.

ABOUT THE AUTHOR

...view details