తెలంగాణ

telangana

ETV Bharat / business

అమెజాన్ సీఈఓగా తప్పుకోనున్న జెఫ్​ బెజోస్​ - New York Times

ఈ ఏడాది చివరికల్లా సీఈఓ పదవి నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించారు అమెజాన్​ అధినేత జెఫ్​ బెజోస్​. ఆ తర్వాత.. ఆయన ఎగ్జిక్యూటివ్​ ఛైర్మన్​గా కొనసాగుతారు. నూతన సీఈఓగా అమెజాన్​ వెబ్​ సర్వీస్​ హెడ్​ ఆండీ జెస్సీ నియామకం కానున్నారు.

By

Published : Feb 3, 2021, 4:54 AM IST

Updated : Feb 3, 2021, 6:13 AM IST

అపరకుబేరుడు, టెక్‌ దిగ్గజం, అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌ తన సీఈఓ పదవి నుంచి తప్పుకోనున్నారు. ఈ ఏడాది చివరికల్లా ఆ బాధ్యతల నుంచి వైదొలగనున్నట్లు స్వయంగా ప్రకటించారు. బెజోస్‌ స్థానంలో అమెజాన్‌ వెబ్‌ సర్వీస్‌ హెడ్‌ ఆండీ జెస్సీ సీఈఓగా నియామకం కానున్నారు.

27 ఏళ్ల క్రితం ఇంటర్నెట్‌లో పుస్తకాలు అమ్మేందుకు అ‌మెజాన్‌ను ప్రారంభించిన బెజోస్‌.. అంచెలంచెలుగా ఎదిగి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా మారారు. ఈ సందర్భంగా బెజోస్‌ తన కంపెనీ ఉద్యోగులకు లేఖ రాశారు. అమెజాన్‌ అంటే ఒక ఆవిష్కరణగా పేర్కొన్న బెజోస్‌.. ఇప్పటి వరకు అమెజాన్‌ను కనిపెట్టుకుంటూ వచ్చానని, ఇక ఈ పదవి నుంచి మారడం సరైన సమయంగా పేర్కొన్నారు. ఈ ఆర్థిక ఏడాది మూడో త్రైమాసికానికల్లా పదవి నుంచి తప్పుకొని ఆండీ జెస్సీకి పగ్గాలు అప్పజెప్పనున్నట్లు తెలిపారు. అయితే ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా వ్యవహరించనున్న బెజోస్‌.. బెజోస్‌ ఎర్త్ ఫండ్‌, బ్లూ ఆర్జిన్‌ స్పేష్‌ షిప్‌, అమెజాన్‌ డే 1 ఫండ్‌పై మరింత దృష్టి పెట్టనున్నట్లు చెప్పారు. ‌

ఇదీ చూడండి:'ఫ్యూచర్'​తో వివాదంలో అమెజాన్​కు ఊరట

ఆశ్చర్యం..

సీఈఓ పదవి నుంచి తప్పుకోనున్నట్లు చేసిన ప్రకటనతో వాల్‌స్ట్రీట్‌తో పాటు అమెరికా వ్యాపార వర్గాలు ఆశ్చర్యానికి గురయ్యాయి. అయితే అమెజాన్‌ వ్యాపారంపై ఈ నిర్ణయం ఏమాత్రం ప్రభావం చూపలేదు.

ఇక నూతన సీఈఓగా బాధ్యతలు తీసుకోనున్న ఆండీ జెస్సీ 1997లో అమెజాన్‌లో మార్కెటింగ్‌ మేనేజర్​‌గా చేరారు. 2003లో అమెజాన్‌ వెబ్‌ సర్వీస్‌ ఏర్పాటులో కీలకమయ్యారు.

ఇదీ చూడండి:అమెజాన్​ అధినేత ఉదారత- దాతృత్వంలోనూ టాప్​ ​

Last Updated : Feb 3, 2021, 6:13 AM IST

ABOUT THE AUTHOR

...view details