తెలంగాణ

telangana

ETV Bharat / business

ఐటీఆర్​ దాఖలు ఇప్పుడు మరింత సులభం! - ఇ-ఫైలింగ్

ఆదాయ పన్ను రిటర్నులను సులభంగా దాఖలు చేసేందుకు వీలుగా ఆదాయపు పన్నుశాఖ 'ఇ-ఫైలింగ్ లైట్​' పోర్టల్​ను తీసుకొచ్చింది. ప్రభుత్వం కూడా పన్ను చెల్లింపుదారులు ఐటీఆర్​ దాఖలు చేయడానికి ఆగస్టు 31 వరకు గడువు పెంచింది.

ఐటీఆర్​ దాఖలు ఇప్పుడు మరింత సులభం!

By

Published : Aug 7, 2019, 5:37 AM IST

2018-19 ఆర్థిక సంవత్సరానికి ఆదాయ పన్ను రిటర్నులు (ఐటీఆర్​) దాఖలు చేసేందుకు ఆగస్టు 31 వరకు గడువు పెంచింది. ఐటీఆర్​ స్వయంగా దాఖలు చేయడం క్లిష్టమైన పని. ఇందుకు పట్టే సమయం కూడా ఎక్కువే. ఆదాయ పన్ను రిటర్నులను సులభంగా దాఖలు చేసేందుకు వీలుగా ఆదాయపు పన్నుశాఖ తన 'ఇ-ఫైలింగ్​ వెబ్​సైట్​'లోనే 'ఇ-ఫైలింగ్​ లైట్​' పోర్టల్​ను పొందుపరిచింది.

లైట్​ వెర్షన్​

ఆదాయపు పన్నుశాఖ వెబ్​సైట్​లో ఐటీఆర్​.... ఇ-ఫైలింగ్​కు సంబంధించి ఎలాంటి కార్యకలాపాలు చేయని పన్ను చెల్లింపుదారులకు ఈ కొత్త సౌకర్యం ఉపయోగపడుతుంది. ఆగస్టు 1 నుంచి వెబ్​సైట్​లో నమోదైన వినియోగదారులందరికీ ఇ-ఫైలింగ్ సదుపాయం ఉంటుంది. ఇది పొందేందుకు రెండు మార్గాలు ఉన్నాయి.

1. స్టాండర్డ్ విధానం: వివిధ రకాల ఆప్షన్​లతో ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది.

2. లైట్​ వెర్షన్: ఇది ఐటీఆర్​ ఫైల్ చేసేందుకు మాత్రమే ఉద్దేశించినది.

పన్ను చెల్లింపుదారులు ఐటీఆర్​ను ఫైల్​ చేసేందుకు ఈ రెండు సదుపాయాల్లో దేనినైనా వినియోగించుకోవచ్చు.

చాలా సులభంగా

ఆదాయపు పన్నుశాఖ ఇ-ఫైలింగ్ వెబ్​సైట్​ హోంపేజ్​లో ఎడమవైపు 'క్విక్​ ఐటీఆర్ ఫైలింగ్' పేరుతో ఆప్షన్​ ఉంటుంది. ఈ ఆప్షన్​ను క్లిక్​ చేయడం ద్వారా 'లైట్​' పోర్టల్​కు చేరుకోవచ్చు.

ఐటీఆర్​ దాఖలు ఇప్పుడు మరింత సులభం!

'లైట్​' ఇ-ఫైలింగ్ పోర్టల్​లో మీరు ఐటీఆర్​ను ఫైల్​ చేసి, ఇ-వెరిఫికేషన్ ప్రాసెస్​ను పూర్తి చేయవచ్చు. ప్రీ-ఫిల్​ ఎక్స్​ఎంఎల్​ను డౌన్​లోడ్ చేసుకోవడం ద్వారా, ఫారం 26 ఎఎస్​ (టీడీఎస్​ కోసం), ఇ-ఫైల్​ చేసిన ఆదాయపు పన్ను రిటర్న్​లను తనిఖీ చేయవచ్చు. (ఎక్స్ఎంఎల్/ఐటీఆర్/ఐటీఆర్​-వీ ఆప్షన్​లను డౌన్​లోడ్​ చేసుకోనవసరం లేదు).

ఇ-ప్రొసీడింగ్, ఇ-నివారన్, కంప్లెన్స్, వర్క్​లిస్ట్, ప్రొఫైల్​ సెట్టింగ్స్ లాంటి ఇతర ఫీచర్ల కోసం ఇ-ఫైలింగ్ హోంపేజ్​లోని 'పోర్టల్​ లాగిన్​' బటన్​పై క్లిక్​ చేయడం ద్వారా పూర్తి వెర్షన్​కు వెళ్లవలసి ఉంటుంది. అన్ని వర్గాల పన్ను చెల్లింపుదారులు సులభంగా, త్వరగా ఐటీఆర్​ ఫైల్​ చేసేందుకు 'లైట్​' వెర్షన్​ ప్రారంభించారు.

ఐటీఆర్​ దాఖలు చేస్తే కలిగే లాభాలు సహా ఆన్​లైన్​లో సులువుగా రిటర్నులు దాఖలు చేసే విధానం కోసం ఈ వీడియో చూడండి....

ఐటీఆర్​ దాఖలు ఇప్పుడు మరింత సులభం!

ఇదీ చూడండి: చైనాకు 'కరెన్సీ మానిపులేటర్'​ ముద్ర వేసిన అమెరికా

ABOUT THE AUTHOR

...view details