It raid news: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ(ఎన్‌ఎస్‌ఈ) మాజీ ఎండీ చిత్రా రామకృష్ణ నివాసంలో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆమెకు చెందిన ముంబయిలోని ఇతర ప్రాంతాల్లో కూడా సోదాలు చేపట్టారు. పన్ను ఎగవేత కేసులో ఐటీ రైడ్స్ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
ఆనంద్‌సుబ్రమణియన్‌ను ఎన్‌ఎస్‌ఈ చీఫ్ స్ట్రాటజిక్ అడ్వైజర్‌గా నియమించడం, తిరిగి గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసరుగా, ఎండీ సలహాదారుగా మార్చడం వంటి విషయాల్లో పాలనా పరమైన అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో ఇటీవల వార్తల్లో నిచిచారు చిత్రా రామకృష్ణ.
చిత్రా రామకృష్టతో పాటు ఇతరులపై పన్ను ఎగవేత, ఆర్థిక అవకతవకలకు సంబంధించిన ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఇవి మాత్రమే కాకుండా ఎన్‌ఎస్‌ఈ ఆర్థిక, వ్యాపార ప్రణాళికలు, డివిడెండ్లకు సంబంధించిన విషయాలతో పాటు ఆయా సంస్థల త్రైమాసిక ఫలితాల సమాచారం, ఇతర అంతర్గత సమాచారాన్ని ఆమె ఓ యోగితో పంచుకున్నారని పేర్కొన్నారు. దీనితో పాటే ఎక్స్ఛేంజ్ ఉద్యోగుల పనితీరు అంచనాలపై కూడా ఆయనను సంప్రదించారని చెప్పారు.
చిత్రా రామకృష్ణ ఎన్ఎస్ఈకి 2013 ఏప్రిల్ నుంచి 2016 డిసెంబర్ వరకు ఎండీ, సీఈఓగా బాధ్యతలు నిర్వహించారు.
ప్రధాని, ఆర్థిక మంత్రి మౌనంపై కాంగ్రెస్ ప్రశ్నలు..