పెట్రోల్ ధరల బాదుడు నుంచి సామాన్యుడికి ఇప్పుడప్పుడే ఊరట లభించేలా కనిపించడం లేదు. నిరంతర ప్రక్రియలా మారిపోయిన పెట్రో ధరల బాదుడుతో.. బండి బయటకు తీయాలంటేనే వాహనదారుడి గుండె గుబేలుమంటోంది.
రెండు నెలల క్రితం మొదలైన ఇంధన ధరల పెంపు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. బంగాల్ ఎన్నికల సమయంలో వరుసగా.. 18 రోజుల పాటు స్థిరంగా ఉన్న ఇంధన ధరలు ఆ తర్వాత మే 4 నుంచి వరుసగా పెరుగుతూ వస్తున్నాయి.
సోమవారం కొత్త రికార్డులు..
సోమవారం లీటర్ పెట్రోల్ పై 35 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. అయితే డీజిల్ ధరలపై.. ఎలాంటి పెంపు లేకుండా యథావిధిగా కొనసాగించాయి. మే నెల నుంచి.. ఇప్పటివరకు మొత్తం 35 సార్లు పెట్రోల్ ధరలను పెంచగా డీజిల్ ధరను 33 సార్లు పెంచాయి చమురు మార్కెటింగ్ సంస్థలు.
మే నెలలో 16 సార్లు, జూన్‌లో 16 సార్లు ఇంధన ధరలను పెంచిన చమురు సంస్థలు.. జులైలో ఐదు రోజుల వ్యవధిలోనే మూడు సార్లు పెట్రోల్ ధరను పెంచాయి. దీంతో ఈ రెండు నెలల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.9.46 పైసలు పెరిగింది. 33 సార్లలో డీజిల్ ధర రూ.8.63 పైసలు పెరిగింది.
వివిధ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..