తెలంగాణ

telangana

ETV Bharat / business

పెట్టుబడి కథ - పొదుపు

పొదుపు అత్యవసరం. వడ్డీతో కూడిన పొదుపు ఇంకా మంచిది. రిస్క్​ లేని సులభ మార్గాల్లో పొదుపు చేయగల 9 రంగాల గురించి తెలిపేదే ఈ పెట్టుబడి కథ.

పొదుపు

By

Published : Mar 3, 2019, 3:18 PM IST

అమ్మ పోపు డబ్బాల్లో చిల్లర దాయడం, అత్యవసర సమయాల్లో వాటిని వినియోగించడం చిన్నతనంలో మీరు చూసే ఉంటారు. పొదుపు అనే పక్రియకు భీజం పడింది అక్కడి నుంచే.

ప్రతి వ్యక్తికి అత్యవసరమైంది పొదుపు. అయితే ఈ ఆధునిక కాలంలో పొదుపునకు వడ్డీ అనేది జత కూడింది. ఇదే పెట్టుబడి. సరైన చోట మీరు సొమ్ము పెట్టుబడి పెడితే అటు పొదుపుతో పాటు మీకు వడ్డీల రూపంలో లాభం.

చాలా మంది తమకు అనుకూలం, అనువుకాని చోట పెట్టుబడి పెట్టి సొమ్ము పోగొట్టుకుంటుంటే, మరికొంత మందికి అసలు ఎక్కడ సొమ్ము పెట్టుబడి పెట్టాలో తెలియక గందరగోళానికి గురవుతున్న పరిస్థితి. మరి ఏ రంగంలో పెట్టుబడులు పెట్టాలో తెలుసుకోవాలంటే ఈ పెట్టుబడి కథ చదవాల్సిందే....

పెట్టిన పెట్టుబడికి ఎలాంటి రిస్క్​ లేకుండా అత్యధిక వడ్డీ రావాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఇలా మీ పెట్టుబడికి రక్షణ కల్పిస్తూ అత్యధిక వడ్డీనిచ్చే రంగాలు 9 ఉన్నాయి. అవి:

1. స్టాక్​ మార్కెట్లు:

స్టాక్​ భాషలో మనం వడ్డీని లాభంగా పరిగణించవచ్చు. మార్కెట్లపై పూర్తి అవగాహన ఉంటే వారి బ్యాంకుఖాతాలో సొమ్ము ఎప్పుడూ నిండుగానే ఉంటుంది. ఎలాంటి షేర్​ ఎంచుకోవాలి, ఏ సమయంలో వాటాల అమ్మకాలు జరపాలి అనే విషయాలపై స్పష్టమైన అవగాహన అవసరం.

లాభాలు రావాలంటే:

1. మార్కెట్లో నిపుణులకు కొదవ లేదు. ఎలాంటి నిపుణుడిని ఎన్నుకునారనే దానిపై మీకు వచ్చే లాభం ఆధారపడి ఉంటుంది.

2. సొంత ప్రయోగాలు అనవసరం.

3. మొదట కొద్దికొద్దిగా పెట్టుబడులు పెట్టాలి. అనుభవం గడించే కొద్దీ పెట్టుబడి పరిమితి పెంచుకుంటూపోవచ్చు.

2. మ్యూచువల్​ ఫండ్స్​:

అసలు రిస్క్​ లేనిచోట పెట్టుబడి పెట్టాలంటే మ్యూచువల్​ ఫండ్సే సరైన ఎంపిక. అయితే వీటిలో సూచీల ఆధారంగా వడ్డీ అందించే రిస్క్​ మ్యుూచువల్​ ఫండ్స్​(ఈక్విటీ ఫండ్స్​), రిస్క్​లేని ఫండ్స్​(డెబిట్​ ఫండ్స్​) ఉంటాయి.

రిస్క్​ మ్యూచువల్​ ఫండ్స్​లో లాభ, నష్టాలు సమానంగా ఉంటాయి.

వివిధ సంస్థలు వివిధ రేట్లలో మ్యూచువల్​ ఫండ్స్​ అందిస్తున్నాయి. వీటిలో ఈక్విటీ, డెబిట్​ ఫండ్స్​ రెండూ ఉంటాయి. అయితే పెట్టుబడికి డెబిట్​ ఫండ్స్​ ఎంచుకుంటే మేలు.

3 జాతీయ పింఛను విధానం(ఎన్​పీఎస్​):

దీర్ఘకాల పెట్టుబడికి అత్యుత్తమ పథకం. ఇది కేంద్ర ప్రభుత్వ పథకం. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్​మెంట్ అథారిటీ దీనిని ప్రవేశపెట్టింది. ఇందులో రిస్క్​ అనే పదానికి స్థానం లేదు.

4. భవిష్య నిధి

పన్ను లేకుండా వడ్డీ అందుకునే ఏకైక మార్గం భవిష్య నిధిలో పెట్టుబడి. ఇటీవలే కేంద్రం భవిష్య నిధి పొదుపుపై వడ్డీ రేట్లు పెంచుతూ ప్రకటన విడుదల చేసింది.

5. ఫిక్స్​డ్​ డిపాజిట్లు

సురక్షిత, హెచ్చు వడ్డీ రేట్లు బ్యాంకు ఫిక్స్​డ్​ డిపాజిట్ల ప్రత్యేకత. ఫిక్స్​డ్​ డిపాజిట్​ మొత్తానికి గరిష్ఠంగా లక్ష వరకు బీమా సౌకర్యమూ కల్పిస్తున్నాయి బ్యాంకులు. అవసరానికి అనుగుణంగా నెలవారీ, త్రైమాసిక, అర్ధ-వార్షిక, వార్షిక, అంతకంటే ఎక్కువ సమయం ఫిక్స్​డ్​ డిపాజిట్ చేసుకోవచ్చు.

6. సీనియర్ సిటిజన్స్ పొదుపు పథకం

పదవీ విరమణ చేసిన వారు, వృద్ధులు పొదుపు చేసేందుకు మొదటగా ఎంచుకునేది ఈ పథకాన్నే. 60 లేదా అంతకంటే ఎక్కువ వయసున్న వారు ఇందులో చేరవచ్చు. పోస్టల్​ లేదా బ్యాంకుల్లో దీనికి సంబంధించిన ఖాతా తెరవచ్చు. ఈ పథకం కింద దాచిన సొమ్ముకు 8.33 శాతం వడ్డీ లభిస్తుంది.

7. ఆర్బీఐ బాండ్లు:

7 సంవత్సరాల కాలానికి ఆర్బీఐ పన్నుతో కూడిన బాండ్లు విడుదల చేస్తుంది. వీటిలో పెట్టుబడి పెడితే... పన్ను కట్టి దేశాభివృద్ధికి సహాయ పడడమే కాదు... అధిక వడ్డీ పొందే అవకాశముంది. ప్రస్తుతం 7.75 శాతం వడ్డీ ఇస్తోంది ఆర్బీఐ.

8. స్థిరాస్తి రంగం:

తక్కువ కాలంలో అత్యధిక లాభాన్నిచ్చేది స్థిరాస్థి రంగం. తక్కువ కాలమే కాదు తక్కువ పెట్టుబడితో అధిక లాభం పొందవచ్చు. అయితే ఈ రంగంలో ఆటుపోట్లు ఎక్కువ. ప్రస్తుతం నివాస గృహాలకు డిమాండ్​ అధికంగా ఉండటం, నిర్మాణ రంగంపై జీఎస్టీ రేట్లు తగ్గిస్తూ జీఎస్టీ మండలి తీసుకున్న నిర్ణయాలతో ఈ రంగం జోరు మీద ఉంది. అయితే ఇదే జోరు కొనసాగుతుందని చెప్పలేని పరిస్థితి.

9. బంగారం:

భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెపాల్సిన అవసరం లేదు. ఇది రిస్క్​లేని పెట్టుబడి. డిమాండ్​ ఎప్పుడూ ఉంటుంది. అయితే కొంతకాలం తరువాత అరుగు, తరుగు అంటూ పెట్టుబడిలో కోత పడే ప్రమాదముంది. దీనికి ఓ పరిష్కార మార్గముంది. అదే రిజర్వ్​ బ్యాంకు సావరిన్​ గోల్డ్​ బాండ్లు. సావరిన్​ గోల్డ్​ బాండ్ల పెట్టుబడుల ఉపసంహరణ సమయంలో ఆ రోజు మార్కెట్​ ధర ప్రకారం ధర చెల్లిస్తుంది ఆర్బీఐ.

ABOUT THE AUTHOR

...view details