Investment on Gold and Silver : బంగారం.. వెండి.. ఈ రెండూ మరింత ధగధగలాడనున్నాయి. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.60 వేలకు చేరే అవకాశాలు లేకపోలేవన్నది మార్కెట్ నిపుణుల అంచనా. వెండి కూడా అలాగే కనిపిస్తోంది. కరోనా నేపథ్యంలో వడ్డీ రేట్లు, ఈక్విటీ పెట్టుబడుల కన్నా బంగారం, వెండిలో పెట్టుబడులపైనే ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. అత్యవసర సమయాల్లో విక్రయించుకునేందుకు వీలుగా ఉండటమే ఇందుకు కారణం.
బంగారానికి భారీ డిమాండ్..
Investment on Gold : ఉద్దీపన పథకాల పేరుతో అగ్రరాజ్యాలైన అమెరికా, జపాన్, చైనా, ఐరోపా దేశాలు భారీగా కరెన్సీ ముద్రించాయి. ఫలితంగా ద్రవ్యోల్బణం పెరిగి.. బంగారం డిమాండు ఆకాశాన్నంటుతోంది. హంగేరి, పోలండ్ లాంటి దేశాల రిజర్వు బ్యాంకులు ముందుజాగ్రత్తగా పెద్ద మొత్తంలో బంగారం కొంటున్నాయి. ఇటీవల కాలంలో బిట్‌కాయిన్లపై మోజు కొంత తగ్గటంతో ప్రజలు బంగారం కొనడమే మంచిదని భావిస్తున్నట్లు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం అదుపుతప్పి, వడ్డీరేట్లు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడితే, బంగారం ధర అనూహ్యంగా పెరుగుతుంది. అంటే, బంగారం పెట్టుబడి సమీప భవిష్యత్తులో లాభదాయకం కాబోతోందన్నమాట.
విద్యుత్తు వాహనాలతో వెండికి గిరాకీ