బీమా సంస్థల నుంచి ఇన్స్యూరెన్స్ సొమ్ము పొందటానికి హక్కుదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దిల్లీ వినియోగదారుల కమిషన్ వ్యాఖ్యానించింది. నిరక్షరాస్యులు బీమా దరఖాస్తు ఫారంపై సంతకం చేసేటప్పుడు అందులోని నిబంధనలను ఎలా చదువుతారని వినియోగదారుల కమిషన్ ప్రశ్నించింది. చాలా సందర్భాల్లో బీమా పొందేందుకు నిబంధనలు అడ్డుపడుతున్నాయని పేర్కొంది.
ఉహించని పరిస్థితుల్లో వైద్యం పొందడం కోసమే ఆరోగ్య బీమాను తీసుకుంటారు. బీమా పొందే సమయంలో ఎలాంటి అవకతవకలకు పాల్పడకపోతే, ఆ వినియోగదారునికి కచ్చితంగా బీమా సొమ్ము చెల్లించాలి. - దిల్లీ వినియోగదారుల కమిషన్.
దిల్లీ ఫరీదాబాద్‌కు చెందిన ప్రతాప్ సింగ్ ఓ ప్రయివేటు బీమా సంస్థలో 2008వ సంవత్సరంలో 50 లక్షల రూపాయల పాలసీని తీసుకున్నాడు. ఈ బీమా కాలపరిమితి 20 సంవత్సరాలు . దీనికి ఆయన సోదరుడు విర్పాల్ నగర్‌ను నామినీగా పెట్టాడు.
2009లో ప్రతాప్‌సింగ్ మరణంతో అతని సోదరుడు విర్పాల్ బీమా సొమ్ము కోసం దరఖాస్తు చేసుకున్నాడు. 2010లో బీమా సంస్థ ఆయన వినతిని తిరస్కరించింది.