ఈ-కామర్స్ రంగంలోకి ఫేస్బుక్ అనుబంధ సంస్థ ఇన్స్టాగ్రామ్ అడుగుపెట్టనుంది. దీనికోసం యాప్‌లో కొత్తగా 'చెక్అవుట్' ఆప్షన్‌ను అందుబాటులోకి తెస్తోంది. దీనితో వినియోగదారులు తమకు నచ్చిన బ్రాండ్ల ఉత్పత్తులను కొనుగోలు చేసుకోవచ్చు.
"ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్తగా చెక్అవుట్ ఆప్షన్‌ను ప్రవేశ పెట్టాం. ఇకపై మీకు నచ్చిన వస్తువులు,యాప్‌లోనే కొనుగోలు చేయొచ్చు" -ఫేస్బుక్ , సిలికాన్ వ్యాలీ శాఖ.
ఈ చెక్అవుట్ ఆప్షన్ ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. దీనికి సంబంధించి అమెరికాలో బీటా వర్షన్ యాప్‌ను పరిశీలిస్తున్నారు.
ఎలా పనిచేస్తుంది:
చెక్ అవుట్ బటన్ మీద క్లిక్ చేసి మనకు కావాల్సిన వస్తువులను ఎంపిక చేసుకోవచ్చు. వాటి సైజు, రంగు ఎంచుకుని తర్వాత చెల్లింపులు జరిపే విధంగా దీనిని తీర్చిదిద్దారు.