తెలంగాణ

telangana

ETV Bharat / business

ఇన్ఫోసిస్​లో 10,000 ఉద్యోగాల కోత!

దిగ్గజ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ తన సంస్థ ఉద్యోగాల్లో భారీగా కోత విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మధ్య స్థాయి ఉద్యోగాలతో పాటు సీనియర్​ మేనేజర్​, సీనియర్​ ఎగ్జిక్యూటివ్​ వంటి హోదా కలిగిన ఉద్యోగులను ఇంటికి పంపించే యోచనలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలను ఉంటంకిస్తూ ఓ ఆంగ్ల పత్రిక కథనం ప్రచురించింది.

ఇన్ఫోసిస్​లో 10,000 ఉద్యోగాల కోత!

By

Published : Nov 6, 2019, 8:41 AM IST

కాగ్నిజెంట్‌ బాటలోనే ఇన్ఫోసిస్‌ కూడా నడుస్తోంది. మధ్య, సీనియర్‌ స్థాయిలో ఉద్యోగులను ఇళ్లకు పంపుతోంది. ఉద్యోగుల వ్యయాలు తగ్గించుకోవడంతో పాటు.. కంపెనీ నిర్మాణాన్ని సరళతరం చేసుకోవాలన్నది ఈ ఉద్దేశం వెనక నేపథ్యం. బెంగళూరుకు చెందిన ఈ కంపెనీ ఉద్యోగ స్థాయి(జేఎల్‌)-6(సీనియర్‌ మేనేజర్లు)లో 10% లేదా 2200 మందిని తొలగిస్తోంది.

4వేల నుంచి 10 వేల ఉద్యోగాలకు ముప్పు

జేఎల్‌6, జేఎల్‌7, జేఎల్‌8 స్థాయిల్లో కంపెనీకి 30,092 ఉద్యోగులున్నారు. జేఎల్‌3 కంటే దిగవన, మధ్య స్థాయి(జేఎల్‌4, జేఎల్‌5)ఉద్యోగాల్లో కంపెనీ కనీసం 2-5% మేర కోతలు విధించనుందని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఓ ఆంగ్ల పత్రిక పేర్కొంది. జేఎల్‌3, జేఎల్‌5లలో కంపెనీకి వరుసగా 86,558 మంది; 1.1 లక్షల మంది ఉద్యోగులున్నారు. ఆ లెక్కన దాదాపు 4,000-10,000 మంది సిబ్బందిపై కత్తి వేళాడుతోందన్నమాట. ఇక మొత్తం 971 మంది సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ల(అసిస్టెంట్‌ వైస్‌ప్రెసిడెంట్లు; వైస్‌ప్రెసిడెంట్లు, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్లు, ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్లు)లలో 2-5% మందికి సైతం ఇంటికి వెళ్లమని చెప్పవచ్చు. అంటే 50 మంది సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లకు ముప్పు పొంచి ఉందన్నమాట.

సాధారణమే

ఈ విషయమై కంపెనీని సంప్రదించగా.. ‘అత్యుత్తమ పనితీరునున్న మా సంస్థలో సాధారణంగా కోతలు ఉంటూనే ఉంటాయి. వాటిని భారీ స్థాయిలో కోతలుగా చూడకూడద’ని తెలిపింది. ఇంకో అంతర్జాతీయ ఐటీ దిగ్గజం క్యాప్‌జెమిని సైతం భారత్‌లో 500 మంది ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే.

ABOUT THE AUTHOR

...view details