దేశీయ ప్రైవేటు విమానయాన సంస్థ ఇండిగో.. ప్రయాణికులకు ఆఫర్ ప్రకటించింది. కరోనా టీకా రెండు డోసుల్లో కనీసం ఒక డోసు వేసుకున్నా.. ఛార్జీలో 10 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు వెల్లడించింది. బేసిక్ ఛార్జీపై ఈ డిస్కౌంట్ ఉంటుందని, లిమిటెడ్ పీరియడ్‌కు మాత్రమేనని ప్రకటన చేసింది.
"వ్యాక్సిన్ తీసుకున్న 18 ఏళ్లు పైబడిన ప్రయాణికులకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. అయితే.. టికెట్ బుకింగ్ సమయంలో భారత్‌లో ఉండి, కనీసం ఒక డోస్ తీసుకుని ఉండాలి. ఈ ఆఫర్ పొందేందుకు బుకింగ్ సమయంలో కేంద్ర ఆరోగ్య శాఖ జారీ చేసే టీకా ధ్రువీకరణ పత్రాన్ని చూపిస్తే సరిపోతుంది. అలాగే.. విమానాశ్రయం తనిఖీలు, బోర్డింగ్ గేట్ వద్ద చూపించాలి. దాని ప్రత్యామ్నాయంగా.. విమానాశ్రయ తనిఖీ కేంద్రాల్లో ఆరోగ్య సేతు యాప్‌లో తమ వ్యాక్సిన్ స్టేటస్‌ను చూయించొచ్చు."