తెలంగాణ

telangana

ETV Bharat / business

రిటైల్​ వ్యాణిజ్యంలో 60 రోజుల్లో రూ.9 లక్షల కోట్ల నష్టం! - lockdown effect

లాక్​డౌన్​ కారణంగా దేశీయ రిటైల్​ వ్యాపారులకు రెండు నెలల్లో సుమారు రూ. 9 లక్షల కోట్ల నష్టం వాటిల్లినట్లు అఖిల భారత వ్యాపారుల సమాఖ్య (సీఏఐటీ) వెల్లడించింది. రిటైల్​ రంగం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, ప్రభుత్వం నుంచి ఎలాంటి మద్దతు లేకపోవటం వల్ల భవిష్యత్తుపై వ్యాపారులు ఆందోళన చెందుతున్నారని పేర్కొంది.

India's retail trade
60 రోజుల్లో రిటైల్​ వాణిజ్యంలో రూ.9 లక్షల కోట్లు నష్టం!

By

Published : May 25, 2020, 6:00 AM IST

దేశవ్యాప్తంగా విధించిన లాక్​డౌన్​తో పరిశ్రమలు, వ్యాపారాలు మూతపడ్డాయి. దీంతో గడిచిన 60 రోజుల్లో రిటైల్​ వ్యాణిజ్యంలో సుమారు రూ. 9 లక్షల కోట్లు నష్టపోయినట్లు అఖిల భారత వ్యాపారుల సమాఖ్య(సీఏఐటీ) ప్రకటించింది.

"దేశీయ వాణిజ్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. గత సోమవారం (మే 18) నుంచి దేశవ్యాప్తంగా తెరుచుకున్న దుకాణాలు, వాణిజ్య మార్కెట్లు కేవలం 5 శాతం వ్యాపారాన్ని నమోదు చేశాయి. 80 శాతం వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్లిన క్రమంలో కేవలం 8 శాతం కార్మికులు విధులకు హాజరయ్యారు. లాక్​డౌన్​తో 60 రోజుల్లో దేశీయ వాణిజ్యంలో రూ. 9 లక్షల కోట్ల నష్టం ఏర్పడింది. దాంతో కేంద్ర, రాష్ట్రాలు జీఎస్టీ రాబడిలో సుమారు రూ. 1.5 లక్షల కోట్లు నష్టపోయాయి.

– ప్రవీణ్​ కుమార్​ ఖందేల్వాల్​, సీఏఐటీ ప్రధాన కార్యదర్శి.

వ్యాపారులు తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు ఖందేల్వాల్​. ప్రభుత్వం నుంచి ఎలాంటి మద్దతు లభించకపోవటం వల్ల భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details