తెలంగాణ

telangana

ETV Bharat / business

అక్టోబర్​లో 5.12 శాతం తగ్గిన భారత ఎగుమతులు - ఎగుమతుల్లో క్షీణత

దేశీయ ఎగుమతులు ఈ ఏడాది అక్టోబర్​లో 5.12 శాతం మేర క్షీణించాయి. ప్రధానంగా పెట్రోలియం ఉత్పత్తులు, రత్నాలు, ఆభరణాలు, తోలు ఉత్పత్తులు, ఇంజినీరింగ్​ వస్తువుల ఎగుమతులు తగ్గటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇదే క్రమంలో దిమగుతులు కూడా 11.53 శాతం తగ్గాయి.

Indian exports
భారత ఎగుమతులు

By

Published : Nov 13, 2020, 8:28 PM IST

భారత ఎగుమతులు సెప్టెంబర్​లో సానుకూల వృద్ధి కనిపించినప్పటికీ అక్టోబర్​లో భారీగా పడిపోయాయి. గత నెలలో 5.12 శాతం తగ్గి 24.89 బిలియన్​ డాలర్లకు పడిపోయాయి. ముఖ్యంగా పెట్రోలియం ఉత్పత్తులు, రత్నాలు, ఆభరణాలు, తోలు ఉత్పత్తులు, ఇంజినీరింగ్​ వస్తువుల ఎగుమతుల్లో తగ్గుదలే ఇందుకు కారణంగా ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన గణాంకాలు సూచిస్తున్నాయి.

వాణిజ్య లోటు గత ఏడాది అక్టోబర్​ (11.75 బిలియన్​ డాలర్లు)తో పోలిస్తే ఈ ఏడాది 8.71 బిలియన్​ డాలర్లకు తగ్గింది. ఎగుమతులతో పాటు అక్టోబర్​లో దిగుమతుల్లో కూడా క్షీణత కనిపించింది. గత నెలలో 11.53 శాతం క్షీణతతో 33.6 బిలియన్​ డాలర్లకు ఎగుమతులు తగ్గాయి.

అక్టోబర్​లో ప్రతికూల వృద్ధిని నమోదు చేసిన ప్రధాన ఎగుమతి వస్తువులు

ప్రధాన ఎగుమతి వస్తువులు క్షీణత
పెట్రోలియం ఉత్పత్తులు 52%
జీడిపప్పు 21.57%
రత్నాలు, ఆభరణాలు 21.27%
తోలు ఉత్పత్తులు 16.67%
ఖాదీ ఉత్పత్తులు 12.8%
ఎలక్ట్రానిక్​ వస్తువులు 9.4%
కాఫీ 9.2%
సముద్రపు ఉత్పత్తులు 8%
ఇంజినీరింగ్​ వస్తువులు 3.75%

ఏప్రిల్​-అక్టోబర్​ కాలంలో దేశీయ ఎగుమతులు 19.02 శాతం క్షీణతతో 150.14 బిలియన్​ డాలర్లకు పడిపోయాయి. అలాగే దిగుమతులు 36.28 శాతం తగ్గి 182.29 బిలియన్​ డాలర్లకు తగ్గాయి.

అక్టోబర్​లో చమురు దిగుమతులు 38.52 శాతం తగ్గి 5.98 బిలియన్​ డాలర్లకు చేరాయి. ఏప్రీల్​-అక్టోబర్​ కాలంలో 49.5 శాతం తగ్గాయి.

వరుసగా ఆరు నెలల ప్రతికూలతల తర్వాత సెప్టెంబర్​లో భారత ఎగుమతులు 5.99 శాతం పెరిగి 27.58 బిలియన్​ డాలర్లకు చేరుకున్నాయి. అయితే.. అక్టోబర్​లో మళ్లీ తగ్గటం కాస్త ఆందోళన చెందాల్సిన విషయం.

ఇదీ చూడండి: '2021-22 బడ్జెట్​ రూపకల్పనకు సూచనలివ్వండి'

ABOUT THE AUTHOR

...view details