దేశ జీడీపీ 2021లో 12 శాతం వృద్ధిచెందే అవకాశం ఉందని ప్రముఖ విశ్లేషణ సంస్థ మూడీస్ అనలిటిక్స్ అంచనా వేసింది. ఊహించని విధంగా డిసెంబర్ నెలలో ముగిసిన త్రైమాసికంలో జీడీపీ 0.4 శాతానికి పెరగడం సానుకూల పరిణామాలకు సంకేతమని మూడీస్ వ్యాఖ్యానించింది.
ప్రపంచవ్యాప్తంగా గిరాకీ పుంజుకోవడంతో పాటు దేశీయంగానూ లాక్‌డౌన్ తర్వాత సానుకూల పవనాలు కనిపిస్తున్న నేపథ్యంలో తయారీ రంగం పుంజుకుందని మూడీస్ తెలిపింది. రానున్న రోజుల్లో వ్యక్తిగత వినిమయంతో పాటు గృహేతర పెట్టుబడులు పుంజుకోనున్నాయని, ఇది దేశీయంగా గిరాకీ పుంజుకోవడానికి దోహదం చేయనుందని పేర్కొంది.