స్విస్ బ్యాంకు(Swiss bank)లో భారతీయులు, భారతీయ సంస్థలు దాచుకున్న సొమ్ము రూ.20,700 కోట్లకు పెరిగింది. బ్యాంకుల్లో సెక్యూరిటీల విలువ గణనీయంగా పెరగ్గా.. కస్టమర్ డిపాజిట్లు తగ్గుముఖం పట్టాయి. ఈ మేరకు స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంకు వార్షిక నివేదిక వెల్లడించింది.
గడిచిన 13ఏళ్లల్లో ఇవే అత్యధిక భారతీయ డిపాజిట్లు కావడం గమనార్హం. 2019లో స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లు రూ.6,625 కోట్లుగా ఉన్నాయి. అంతకుముందు రెండేళ్ల పాటు డిపాజిట్లు తగ్గుతూ వచ్చాయి. 2006లో అత్యధికంగా రూ.52,264 కోట్లకు చేరాయి.
రూ.20,706 కోట్లు ఇలా..
- మొత్తం డిపాజిట్లలో రూ.4 వేల కోట్లకు పైగా కస్టమర్ డిపాజిట్లు ఉన్నాయి.
- రూ.3,100 కోట్లు ఇతర బ్యాంకుల వద్ద డిపాజిట్లు
- రూ.16.5 కోట్లు ట్రస్టులు
- రూ.13,500 బాండ్లు, సెక్యూరిటీలు, ఇతర ఆర్థిక సాధనాలు