తెలంగాణ

telangana

ETV Bharat / business

India Cryptocurrency: దేశీయ క్రిప్టో కరెన్సీకి ఏ పేరు పెడతారు? - భారతీయ క్రిప్టో కరెన్సీ వార్తలు

దేశీయంగా డిజిటల్‌ కరెన్సీని తీసుకురానున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌.. బడ్జెట్‌ ప్రసంగంలో తెలిపారు. దీంతో నెట్టింట్లో 'దేశీయ క్రిప్టో కరెన్సీ' టాపిక్‌ ట్రెండ్‌ అవుతోంది. ఈ నేపథ్యంలో దేశీయ క్రిప్టో కరెన్సీకి ఏ పేరు పెడతారంటూ ఓ మీడియా సంస్థ ఎడిటర్‌ ట్విట్టర్‌లో ప్రశ్నించగా.. దానికి నెటిజన్లు తమదైన శైలిలో సమాధానాలిస్తున్నారు.

India Cryptocurrency
India Cryptocurrency

By

Published : Feb 3, 2022, 5:59 AM IST

India Cryptocurrency: ఈ మధ్య క్రిప్టో కరెన్సీ ఆస్తులు.. ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుతం బిట్‌ కాయిన్‌, ఎథేరియం, టీథర్‌, బినాన్స్‌ ఇలా అనేక క్రిప్టో కరెన్సీలు అందుబాటులో ఉన్నాయి. అయితే భారత్‌లో వీటిని చట్టబద్ధం చేయాలా వద్దా అనే అంశంపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు దేశీయంగా డిజిటల్‌ కరెన్సీని తీసుకురానున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో వెల్లడించారు. ఆర్‌బీఐ త్వరలోనే దేశీయ క్రిప్టో కరెన్సీని (ఏ సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ) అందుబాటులోకి తేనుందని పేర్కొన్నారు. దీంతో నెట్టింట్లో ఇప్పుడు 'దేశీయ క్రిప్టో కరెన్సీ' టాపిక్‌ ట్రెండ్‌ అవుతోంది.

త్వరలో రాబోయే దేశీయ క్రిప్టో కరెన్సీకి ఏ పేరు పెడతారంటూ ఓ మీడియా సంస్థ ఎడిటర్‌ ట్విట్టర్‌లో ప్రశ్నించారు. దానికి నెటిజన్లు తమదైన శైలిలో సమాధానాలిస్తున్నారు. ఓ వ్యక్తి 'దినార్స్'అని పెట్టాలని సూచించారు. భారత చరిత్రలో గుప్తుల కాలం స్వర్ణయుగమని, ఆ కాలంలో డబ్బును దినార్స్‌ అని పిలిచేవారని చెప్పారు. మరో నెటిజన్‌ 'ధన్‌' అని పెట్టాలన్నారు. దినార్‌, డాలర్‌, దిర్హామ్‌కి మూలం 'ధన్‌' అని ట్విట్‌ చేశారు. 'ఈ-ధన్‌', 'క్రిపియా', 'ఇండు', 'శ్రీ' అని నెటిజన్లు తమకు తోచిన పేర్లను సూచించారు. క్రిప్టో కరెన్సీపై 30శాతం పన్ను విధించడాన్ని నిరసిస్తూ 'ట్యాక్సీ' అని పేరు పెట్టాలని మరో నెటిజన్‌ పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details