సౌదీ అరేబియా నుంచి కొనుగోలు చేసే చమురులో మే నెలకు సంబంధించి మూడో వంతు మేర తగ్గించి, భారత రిఫైనరీలు దిగుమతి చేసుకోనున్నాయి. మధ్యప్రాచ్యం వెలుపల నుంచి దిగుమతులు పెంచుకోవటంపై భారత్ దృష్టి సారించటం ఇందుకు నేపథ్యం. కరోనా కేసలు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో, దేశీయంగా చమురుకు గిరాకీ తగ్గుతున్నందున ఇప్పుడే ప్రత్యామ్నాయాలు బలోపేతం చేసుకోవాలని భారత్ భావిస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో లాక్డౌన్లు విధిస్తున్నందున, మే నెలలో చమురుకు గిరాకీ తగ్గుతుందన్న అంచనాలున్నాయి.
సౌదీ అరేబియా నిర్లక్ష్యం
ఐఓసీతో పాటు ఇతర రిఫైనరీలు సౌదీ నుంచి నెలవారీగా చేసుకునే చమురు దిగుమతుల్లో సగటున 65 శాతం మాత్రమే మే నెలకు ఆర్డరు ఇవ్వనున్నట్లు ఈ అంశాలతో సంబంధమున్న ముగ్గురు సమాచారం అందించారు. ముడిచమురు ఉత్పత్తి పెంచి, ధరలు తగ్గేలా చూడమని భారత్ కోరినా, సౌదీ అరేబియా పెడచెవిన పెట్టడమూ ప్రస్తుత పరిమాణాలకు కారణం. ఉత్పత్తి కోతలపై ఆంక్షలు ఎత్తివేయటంపై సౌదీ అరేబియా నిర్లక్ష్యం వహిస్తుండటంతో, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునేందుకు ప్రయత్నించాలని గత నెలలో ప్రభుత్వ రిఫైనరీలకు కేంద్రం సూచించిన విషయం విదితమే.
స్పాట్ మార్కెట్‌పైనే..