తెలంగాణ

telangana

ETV Bharat / business

విదేశీ టీకాలపై దిగుమతి సుంకం రద్దు!

విదేశీ కరోనా టీకాలను తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా దిగుమతి సుంకాన్ని రద్దు చేసే యోచనలో కేంద్రం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

By

Published : Apr 20, 2021, 2:12 PM IST

COVID-19 vaccines import duty may Waive
విదేశీ టీకాలపై దిగిమతు సుంకం మాఫీ

విదేశాల నుంచి దిగుమతి చేసుకునే కొవిడ్ టీకాలపై 10 శాతం కస్టమ్స్ సుంకాన్ని కేంద్రం రద్దుచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రష్యాకు చెందిన 'స్పుత్నిక్ వి' టీకా ఈ నెలాఖరు లోపు లేదా వచ్చే నెల ఆరంభంలో భారత్‌కు చేరనుంది. ఇదే సమయంలో మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్‌ సంస్థలు కూడా తమ టీకా అత్యవసర వినియోగానికి అనుమతి కోరుతూ కేంద్రానికి దరఖాస్తు చేసుకున్నాయి.

విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న టీకాలపై ప్రస్తుతం 10 శాతం కస్టమ్స్‌ డ్యూటీ, 16.5 శాతం ఐజీఎస్‌టీ సహా వీటికి అదనంగా సోషల్ వెల్ఫేర్ సర్‌ఛార్జీ విధిస్తున్నారు. ఫలితంగా ప్రస్తుతం దేశంలో పంపిణీ చేస్తున్న కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాల కంటే విదేశీ కొవిడ్ టీకాలు ఖరీదయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో విదేశీ కొవిడ్ టీకాల ధరలను తగ్గించేలా కస్టమ్స్‌ సుంకం మాఫీ ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తున్నట్లు సమాచారం.

ఇదీ చదవండి:స్మార్ట్​ వాచ్​ కొనేముందు ఇవి తెలుసుకోండి..

ABOUT THE AUTHOR

...view details