తెలంగాణ

telangana

ETV Bharat / business

బెల్లీ డాన్స్​లతో పాక్ ఆర్థిక వ్యవస్థకు నూతనోత్సాహం! - ట్విట్

పెట్టుబడిదారుల సదస్సులు... ఇటీవల కొత్త ట్రెండ్. వ్యాపార దిగ్గజాలను ఒక చోట సమావేశపరచడం, తమ దేశంలో/రాష్ట్రంలో ఉన్న అవకాశాలు, వ్యాపారానుకూల విధానాలను వివరించడం ఇలాంటి కార్యక్రమాల ముఖ్య ఉద్దేశం. పాకిస్థాన్​ ఇలాంటి ప్రయత్నమే చేసింది. అయితే సాదాసీదా సమావేశాల్లా జరగలేదు. బెల్లీ డాన్సర్ల గానా భజానాతో జోర్దార్​గా సాగింది. నెట్టింట విమర్శలపాలైంది.

బెల్లీ డాన్స్​లతో పాక్ ఆర్థిక వ్యవస్థకు నూతనోత్సాహం!

By

Published : Sep 9, 2019, 11:30 AM IST

Updated : Sep 29, 2019, 11:20 PM IST

ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్న పాకిస్థాన్ ఇటీవలే అజర్​బైజాన్​లోని బాకులో పెట్టుబడిదారుల సదస్సు నిర్వహించింది. తమ దేశంలో వ్యాపారం చేసేందుకు తరలిరావాలంటూ దిగ్గజ సంస్థల ప్రతినిధులను కోరింది. ఇక్కడ వరకు బాగానే ఉంది. అయితే... అదే సదస్సు వేదికగా బెల్లీ డాన్సర్లతో ప్రత్యేక నృత్య ప్రదర్శన ఏర్పాటు చేయించడం చర్చనీయాంశమైంది. ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ చెబుతున్న "నయా పాకిస్థాన్​" ఇదేనా అంటూ విమర్శలు వెల్లువెత్తేందుకు కారణమైంది.
డబ్బులు కాదు సెల్ఫీలు వచ్చాయ్​!

పాకిస్థాన్​కు చెందిన సర్హాద్ ఛాంబర్ ఆఫ్ కామర్స్​ అండ్ ఇండస్ట్రీ(ఎస్​సీసీఐ) ఆధ్వర్యంలో బాకులో ఈనెల 4 నుంచి 8వ తేదీ వరకు ఈ సదస్సు జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

నృత్య ప్రదర్శనకు ఫిదా అయిన ఓ పెట్టుబడిదారుడు ఎంతో ఉత్సాహంగా బెల్లీ డాన్సర్​తో సెల్ఫీ కూడా తీసుకున్నాడు. మరెంతో మంది నృత్యాకారిణిల ప్రదర్శనలకు ముగ్ధులయ్యారు.

ఇంతగా దిగజారడం అవసరమా!

పాకిస్థాన్ ఇలా పెట్టుబడిదారులను ఆకర్షించడానికి మహిళలతో నృత్య ప్రదర్శనలు ఏర్పాటుచేయడంపై ఆ దేశ పాత్రికేయురాలు గుల్​ బుఖారీ మండిపడ్డారు. ప్రభుత్వ దిగజారుడుతనంపై ట్విట్టర్​ వేదికగా విమర్శలు గుప్పించారు.

గుల్​ బుఖారీ ట్వీట్​ ద్వారా విషయం తెలుసుకున్న నెటిజన్లు.. ఇమ్రాన్​ సర్కార్​పై మండిపడుతున్నారు. భారత్​ చేపట్టిన చంద్రయాన్​-2 మిషన్​ను విమర్శించిన పాకిస్థానీ నేతలు.. పెట్టుబడిదారులను ఆకర్షించడానికి బెల్లీ డాన్స్ చేయించడం సిగ్గుచేటని ఓ వ్యక్తి ట్వీట్​ చేశాడు. పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు... బెల్లీ డాన్స్​కు​ మించి పాకిస్థాన్​ దగ్గర ఏముందని మరో వ్యక్తి అన్నాడు.

నిండా మునిగిన పాకిస్థాన్​

పాకిస్థాన్ పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయింది. 2018-19 సంవత్సరానికి ఆ దేశ ఆర్థికలోటు 8.9 శాతానికి చేరుకుంది. గత మూడు దశాబ్దాల్లోనే ఇది అత్యధికం. ఇప్పటివరకు ఆ దేశాన్ని చైనా, యూఏఈ, సౌదీ అరేబియా ఆర్థికంగా ఆదుకుంటున్నాయి. ఈ కష్టాల నుంచి పాకిస్థాన్​ను కాపాడడానికి 'అంతర్జాతీయ ద్రవ్యనిధి' 6 బిలియన్​ డాలర్ల ఉద్దీపన ప్యాకేజీ అందించింది.

ఇదీ చూడండి: గర్భిణీని 5కి.మీ దూరం మోస్తూ ఆస్పత్రికి నడక

Last Updated : Sep 29, 2019, 11:20 PM IST

ABOUT THE AUTHOR

...view details