వేగంగా వృద్ధిచెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారతదేశం ఒకటని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ కితాబిచ్చింది. భారత్ గత ఐదేళ్లలో ఎన్నో సంస్కరణలు చేపట్టినప్పటికీ... వృద్ధిని వేగవంతం చేయడానికి మరిన్ని చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఐఎమ్ఎఫ్ అభిప్రాయపడింది. ఐదేళ్లలో భారత వృద్ధి రేటు ఐదు శాతం పైబడిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసింది.
వరల్డ్ ఎకనామిక్ ఔట్లుక్...
ఏప్రిల్లో ప్రపంచ బ్యాంకు సమావేశం జరగనుంది. "వరల్డ్ ఎకనామిక్ ఔట్లుక్" పేరుతో ఈ సమావేశంలో ఓ నివేదిక విడుదల చేయనుంది ఐఎమ్ఎఫ్. నివేదికలో భారత ఆర్థిక వృద్ధికి సంబంధించి పూర్తి సమాచారం అందిస్తామని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ సమాచార విభాగ డైరెక్టర్ గెర్రి రైస్ తెలిపారు.
బ్యాంకింగ్, ద్రవ్యపరపతి విధానం, భూ సంస్కరణలు తదితర విభాగాల్లో మరిన్ని సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని రైస్ అభిప్రాయపడ్డారు.