తెలంగాణ

telangana

ETV Bharat / business

మీరు జియో కస్టమరా? అయితే ఇది మీకోసమే... - jio announce new top up recherges

డేటాకు మాత్రమే ఛార్జీ.. జీవితకాలం ఉచితకాల్స్​ నినాదంతో సేవలు ఆరంభించిన రిలయన్స్​ జియో... అందుకు విరామం పలికింది. ఇకపై ఇతర నెట్​వర్క్​లకు చేసుకునే మొబైల్​ వాయిస్​కాల్స్​కు నిమిషానికి 6 పైసలు ఛార్జ్​ చేస్తామని ప్రకటించింది. అయితే రీఛార్జ్​ ఎలా చేసుకోవాలి, ఎలాంటి ఆఫర్లు అందుబాటులో ఉన్నయో తెలుసుకుందాం..

మీరు జియో కస్టమరా? అయితే ఇది మీకోసమే...

By

Published : Oct 10, 2019, 12:23 PM IST

Updated : Oct 10, 2019, 1:37 PM IST

ఉచిత కాల్స్​, తక్కువ ధరకే డేటా అందిస్తూ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జియో... ఇక నుంచి కాల్​ ఛార్జీలు వసూలు చేయనుంది. ఇతర నెట్​వర్క్​లకు చేసే కాల్స్​పై నిమిషానికి 6 పైసలు వసూలు చేయనున్నట్లు ప్రకటించింది ఆ సంస్థ. నేటి నుంచి రీఛార్జ్​ చేసే వారికి ఇది వర్తిస్తుందని తెలిపింది.

సంస్థ తాజా నిర్ణయంతో రీఛార్జ్​ ఎలా చేసుకోవాలి, కాల్​ ఛార్జీలు ఏవిధంగా ఉండనున్నాయి అనే విషయంలో జియో కస్టమర్లు అయోమయంలో పడ్డారు. ఇందుకోసం ప్రత్యేక టాప్ అప్​లను ప్రకటించింది సంస్థ.

కాల్స్​ కోసం రూ.10 నుంచి టాప్ అప్​ ఓచర్లతో రీఛార్జ్ చేసుకోవచ్చని తెలిపింది. ప్రతి రూ.10కి 1జీబీ చొప్పున డేటాను అదనంగా కేటాయిస్తామని తెలిపింది. ఒక నెట్​వర్క్​ చందాదార్లు వేరొక నెట్​వర్క్​ పరిధిలోని ఫోన్లకు కాల్స్​ చేస్తే, కాల్​ అందుకున్న నెట్​వర్క్​కు తొలి సంస్థ ఛార్జీ చెల్లించాలన్న (ఐయూసీ) ఆదేశాలు అమల్లో ఉన్నంత వరకు కాల్​ ఛార్జీలు కొనసాగుతాయని స్పష్టం చేసింది జియో.

అందుబాటులో ఉన్న టాప్ అప్​ ఓచర్ల వివరాలు...

టాప్ అప్​ ఓచర్​ ధర నిమిషాలు (ఇతర నెట్​వర్క్​లకు) ఉచిత డేటా (జీబీ)
10 124 1
20 249 2
50 656 5
100 1,362 10

పోస్ట్​ పెయిడ్​ కస్టమర్లకు..

పోస్ట్​ పెయిడ్​ వినియోగదారులకు అంతర్జాలం నిలిపివేసిన క్రమంలో చేసే అవుట్​ గోయింగ్​ కాల్స్​కు ఒక్కో నిమిషానికి 6 పైసలు వసూలు చేయనున్నారు. ప్రీపెయిడ్​ కస్టమర్లకు అందిస్తున్నట్లుగానే ఛార్జీకి సమానంగా అదనపు డేటా లభించనుంది.

ఏమిటీ ఐయూసీ వ్యవహారం?

ఒక టెలికాం నెట్​వర్క్​ నుంచి మరో సంస్థకు కాల్స్​ వెళ్తే, అనుసంధాన ఛార్జీ (ఐయూసీ) కింద మొదటి సంస్థ నిమిషానికి 14 పైసలు చెల్లించాల్సి వచ్చేది. 2017 అక్టోబర్​ 1 నుంచి 2019 డిసెంబర్​ 31 వరకు ఐయూసీ కింద నిమిషానికి 6 పైసలే వసూలు చేయాలని ట్రాయ్​ నిర్ణయించింది. 2020 జనవరి 1 నుంచి ఐయూసీ ఛార్జీల వ్యవస్థే ఉండకూడదు. అప్పటి నుంచి నెట్​వర్క్​ల మధ్య వెళ్లే కాల్స్​కు ఐయూసీ ఛార్జీల విధింపు ఉండకూడదు. కానీ ఐయూసీ ఛార్జీల వ్యవస్థ గడువు పొడిగించాలా, వద్దా అనే విషయమై ఒక చర్చాపత్రాన్ని ట్రాయ్​ విడుదల చేసింది. ఈ అనిశ్చితి నేపథ్యంలో ఇతర నెట్​వర్క్​లకు వెళ్లే కాల్స్​కు ఐయూసీ ఛార్జీలు వసూలు చేయాలని జియో నిర్ణయించింది.

ఇదీ చూడండి:రిలయన్స్​ జియో షాక్​: ఇకపై కాల్​ ఛార్జీలు వసూలు

Last Updated : Oct 10, 2019, 1:37 PM IST

ABOUT THE AUTHOR

...view details