భారత మార్కెట్లోకి మరో కొత్త మోడల్ కారును విడుదల చేసింది హ్యుందాయ్ మోటార్స్ ఇండియా(Hyundai motors India). 'ఐ20 ఎన్ లైన్' పేరుతో విడుదలైన ఈ కారు ధరను (దిల్లీ ఎక్స్ షోరూం) రూ.9.84 లక్షల నుంచి రూ.11.76 లక్షల మధ్య ఉంచింది. ఎన్లైన్లో ఎన్6, ఎన్8 వేరియంట్లు ఉన్నట్లు వివరించింది. రెండూ పెట్రోల్ వేరియంట్లే.
ఎన్ లైన్ ఫీచర్లు..
- 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్- 88.3 కిలో వాట్ల శక్తిని ఉత్పత్తి చేసే సామర్థ్యం
- 4 సిలిండర్స్, 16 వాల్వ్స్
- 6-స్పీడ్ ఐఎంటీ గేర్ బాక్స్, 7 స్పీడ్- డీసీటీ గేర్ బాక్స్ (ఎన్8లో మాత్రమే)
- సీటిరగ్ కెపాసిటీ-5
- డ్రైవర్‌తో పాటు ప్యాసింజర్‌కు ఎయిర్‌బ్యాగ్ సదుపాయం
- రెండు వీల్స్‌కు డిస్క్ బ్రేక్
- పార్కింగ్ అసిస్టెంట్ (వెనుకవైపు కెమెరాతో)
పియాజియో ఇండియా నుంచి కొత్త బైక్‌లు..