ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2021-22) గాను 6వ విడత సార్వభౌమ పసిడి బాండ్లు ఆగష్టు 30 నుంచి అందుబాటులోకి వచ్చాయి. ఈ బాండ్లు సెప్టెంబరు 3వ తేది వరకు అందుబాటులో ఉండనున్నాయి. మదుపరులు వారి డీ మ్యాట్ ఖాతాల ద్వారా గానీ, ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా గానీ, ప్రభుత్వం అందుబాటులో ఉంచిన ఇతర మార్గాల ద్వారా గానీ బాండ్లను కొనుగోలు చేయవచ్చు.
భారతీయ అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) ఆన్‌లైన్ ద్వారా సార్వభౌమ పసిడి బాండ్లను కొనుగోలు చేసే వీలుకల్పిస్తుంది. ఎస్‌బీఐ ఖాతాదారులు ఈ-సర్వీస్‌లో ఉన్న ఐఎన్‌బి ఆప్షన్ ద్వారా నేరుగా పెట్టుబడి పెట్టవచ్చు.
ఎస్‌బీఐ ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా సార్వభౌమ పసిడి బాండ్లను కొనుగోలు చేసే విధానం:
- ముందుగా ఎస్‌బీఐ నెట్ బ్యాంకింగ్ ఖాతాకు లాగిన్ అవ్వాలి.
- ఇ-సర్వీస్ ఆప్షన్‌లో ఉన్న సావరిన్ గోల్డ్ బాండ్‌పై క్లిక్ చేయాలి
- టర్మ్స్ అండ్ కండిషన్స్ బాక్స్‌లో టిక్ చేసి ప్రాసీడ్ బటన్‌ను క్లిక్ చేయాలి.
- రిజిస్ట్రేషన్ ఫారమ్‌ను పూర్తి చేసి సబ్మిట్ చేయాలి. ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది.
గోల్డ్ బాండ్లను ఒక గ్రాము బంగారం ధరతో మొదలుకుని జారీ చేస్తారు. అంటే ఈ పథకంలో జారీ చేసే ఒక్కో బాండు ఒక గ్రాము బంగారంతో సమానం. కనీసం ఒక గ్రాము నుంచి పెట్టుబడి పెట్టవచ్చు. వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలవారు గరిష్టంగా 4 కేజీల వరకు, సంస్థలు 20 కేజీల వరకు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.
ప్రయోజనాలు:
ఖచ్చితమైన రాబడి..
సార్వభౌమ పసిడి బాండ్లలో పెట్టుబడులు పెట్టిన వారు వార్షికంగా 2.5 శాతం వడ్డీ రేటుతో స్థిరమైన రాబడిని పొందవచ్చు. ఈ వడ్డీని ఆరు మాసములకు ఒకసారి పెట్టుబడిదారుల ఖాతాలో జమ చేస్తారు. చివరి ఆరు నెలల వడ్డీని మొత్తం పెట్టుబడితో కలిపి చెల్లిస్తారు.
నిల్వ చేయనవసరం లేదు..
భౌతిక రూపంలో బంగారాన్ని కొనుగోలు చేస్తే, దాన్ని నిల్వ చేయాలి. ఎక్కడ సురక్షితంగా ఉంటుందో చూసుకోవాలి. కానీ ఈ బాండ్లలో అలాంటి ఇబ్బందుకు ఉండవు కాబట్టి మరింత భద్రంగా ఉంటాయి.