దేశవ్యాప్తంగా 7 ప్రధాన నగరాల్లో 2020 చివరి త్రైమాసికంలో (అక్టోబర్-డిసెంబర్) 1,10,811 ఇళ్ల విక్రయాలు నమోదయ్యాయి. 2019 ఇదే సమయంతో పోలిస్తే ఈ మొత్తం 25 శాతం ఎక్కువని.. డేటా అనలైటిక్ సంస్థ ప్రాప్ఈక్విటీ నివేదిక ద్వారా వెల్లడైంది. 2019 చివరి త్రైమాసికంలో 88,976 గృహ విక్రయాలు నమోదైనట్లు తెలిసింది.
కరోనా కారణంగా 2, 3 త్రైమాసికాల్లో ఇళ్ల విక్రయాలు భారీగా పడిపోయినా.. పండుగ సీజన్ జోరుతో చివరి త్రైమాసికంలో మాత్రం 78 శాతం వృద్ధి (క్యూ3తో పోలిస్తే) నమోదైనట్లు నివేదిక వివరించింది ప్రాప్ఈక్విటీ. 2020 క్యూ3లో 62,197 యూనిట్లు మాత్రమే అమ్ముడైనట్లు పేర్కొంది.