తెలంగాణ

telangana

ETV Bharat / business

జనవరిలో హోండా కార్ల ధరలు పెంపు - హోండా వాహనాలు

ప్రముఖ ఆటోమొబైల్​ కంపెనీ హోండా కార్స్‌ ఇండియా లిమిటెడ్‌ వాహనాల ధరలను పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. యాజమాన్యం ఇప్పటికే ఆ సంస్థ డీలర్లకు సమాచారం ఇచ్చినట్లు పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి.

Honda to increase vehicle prices from January: Sources
జనవరి నుంచి పెరగనున్న హోండా వాహనాల ధరలు

By

Published : Dec 20, 2020, 5:45 PM IST

జపాన్‌కు చెందిన ఆటో మొబైల్​ దిగ్గజ సంస్థ హోండా కార్స్‌ ఇండియా లిమిటెడ్‌ (హెచ్‌సీఐఎల్‌) దేశీయ మార్కెట్లో వాహనాల ధరలను పెంచాలని నిర్ణయించింది. ఈ మేరకు కంపెనీ డీలర్లకు సమాచారం ఇచ్చినట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. వచ్చే ఏడాది జనవరి నుంచి పెరిగిన ధరలు అమలులోకి రానున్నట్లు కంపెనీ డీలర్​ ఒకరు చెప్పారు.

కరెన్సీ ప్రభావం, ఇన్​పుట్​ వ్యయంలో ఒత్తిడి కారణంగా ధరలు పెంచాలని సంస్థ నిర్ణయించినట్లు తెలిపారు. హోండా అమేజ్ నుంచి ప్రీమియం ఎస్​యూవీ సీఆర్​-వి వరకు పెంచిన ధరలు వర్తిస్తాయని తెలుస్తోంది. దిల్లీ మార్కెట్​లో ప్రస్తుతం అమేజ్ ధర రూ .6.17 లక్షల నుంచి ప్రారంభం కాగా, ఎంట్రీ లెవల్ సీఆర్​-వి రూ. 28.71 లక్షలుగా ఉంది.

ఇదీ చూడండి: బీఎస్‌-6 అమ్మకాల్లో హోండా మైలురాయి

ABOUT THE AUTHOR

...view details