కరోనా కట్టడికి ప్రస్తుతం దేశవ్యాప్త లాక్డౌన్ కొనసాగుతోంది. ఈ కారణంగా ఆటోమొబైల్ సంస్థల కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. అయితే లాక్డౌన్ ఉన్నా విక్రయాలు జరిపేందుకు ఆన్లైన్ వేదికను ఎంచుకుంటున్నాయి పలు సంస్థలు. ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజాలు ఫోక్స్ వ్యాగన్, బీఎండబ్ల్యూ, మెర్సిడెజ్ బెంజ్, హోండా వంటి సంస్థలు ఆన్లైన్లో అమ్మకాలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించాయి.
ఇంటి నుంచి బయటకు రాకుండా.. సురక్షితంగా ఇంట్లో నుంచే నచ్చిన మోడల్‌ను ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చని చెబుతున్నాయి ఈ సంస్థలు.
'హోండా ఫ్రం హోం'
ఆన్లైన్లో 'హోండా ఫ్రం హోం' పేరుతో కార్ల విక్రయాలు ప్రారంభించినట్లు హోండా ఇండియా తెలిపింది. వినియోగదారులు సులభంగా నచ్చిన కారును, తమకు అనువైన డీలర్షిప్ నుంచి కోనుగోలు చేసే విధంగా ప్లాట్‌ఫాంను రూపొందించినట్లు పేర్కొంది.
ఫోక్స్ వ్యాగన్ ..