తెలంగాణ

telangana

ETV Bharat / business

Home Rates: ఆఫీసు స్థలానికి అనూహ్య గిరాకీ- ఇళ్ల ధరలు పైపైకి! - real-estate rates

Home Rates: దేశవ్యాప్తంగా 2022లో ఇళ్ల ధరలు 5 శాతం పెరిగే అవకాశం ఉన్నట్లు స్థిరాస్తి కన్సల్టింగ్‌ సేవల సంస్థ నైట్‌ ఫ్రాంక్‌ పేర్కొంది. ఐటీ కంపెనీల నియామకాలు అధికంగా ఉన్నందున ఆఫీసు స్థలానికి వచ్చే ఏడాది గిరాకీ పెరుగుతుందని అంచనా వేసింది. 'ఫ్లెక్సిబుల్‌ ఆఫీసు స్పేస్‌'కు గిరాకీ ఇంకా ఎక్కువగా ఉంటుందని వివరించింది.

Home Rates
Home Rates

By

Published : Dec 10, 2021, 8:40 AM IST

House Prices: దేశీయంగా వచ్చే ఏడాదిలో ఇళ్ల ధరలు 5 శాతం పెరిగే అవకాశం ఉన్నట్లు స్థిరాస్తి కన్సల్టింగ్‌ సేవల సంస్థ నైట్‌ ఫ్రాంక్‌ పేర్కొంది. కరోనా పరిణామాల వల్ల ఈ ఏడాది నివాస గృహాల ధరల్లో హెచ్చుతగ్గులు అధికంగా కనిపించినా, వచ్చే ఏడాది ధరలు స్థిరంగా ఉండొచ్చని '2022 అవుట్‌లుక్‌ రిపోర్ట్‌'లో ఈ సంస్థ పేర్కొంది. ఐటీ కంపెనీల నియామకాలు అధికంగా ఉన్నందున ఆఫీసు స్థలానికి వచ్చే ఏడాది గిరాకీ పెరుగుతుందని అంచనా వేసింది. 'ఫ్లెక్సిబుల్‌ ఆఫీసు స్పేస్‌'కు గిరాకీ ఇంకా ఎక్కువగా ఉంటుందని వివరించింది.

ఈ నివేదికలోని ముఖ్యాంశాలు ఇలా..

  • విశాలంగా, అధునాతన సదుపాయాలు కల ఇళ్లను వినియోగదార్లు ఇష్టపడుతున్నారు. దీంతోపాటు నిర్మాణ సామగ్రి ధరలు అధికం కావడంతో, ఇళ్ల ధరలు పెరుగుతున్నాయి. వచ్చే ఏడాదిలో ధరల వృద్ధి 5 శాతం ఉండొచ్చు.
  • దేశంలోని 5 అతిపెద్ద ఐటీ కంపెనీలు ఇటీవల కాలంలో 2.60 లక్షల మంది నిపుణులను నియమించుకున్నాయి. వలసల రేటు (ఉద్యోగులు కంపెనీలు మారేది) 20 శాతం ఉందనుకుంటే, నికరంగా 2.08 లక్షల మందిని కొత్తగా ఎంపిక చేసినట్లు అవుతుంది. వీరంతా కార్యాలయాలకు వస్తే అదనంగా 1.16 కోట్ల చదరపు అడుగుల ఆఫీసు స్థలం కావాల్సి వస్తుంది. వచ్చే రెండేళ్లలో ఈ స్థలం అవసరం.
  • 'ఫ్లెక్సిబుల్‌ ఆఫీస్‌ స్పేస్‌'కు గిరాకీ పెరిగేదే కానీ తగ్గే అవకాశం లేదు.
  • నాణ్యమైన ఆఫీసు స్థలాన్ని కంపెనీలు, ఉద్యోగులు ఇష్టపడుతున్నందున ఆఫీసు స్థల అద్దెలు స్ధిరంగా ఉండటంతో పాటు పైకి పెరిగే అవకాశం లేకపోలేదు.
  • ఇ-కామర్స్‌ విస్తరణ వల్ల గోదాము స్థలానికి ఎన్నడూ లేనంత డిమాండ్‌ కనిపిస్తోంది. అందువల్ల 2023 నాటికి 4.59 కోట్ల చదరపు అడుగుల గోదాము స్థలం అవసరమని అంచనా.
  • దేశీయ డేటా కేంద్రాల విపణి ప్రస్తుతం445 మెగావాట్ల స్థాయిలో ఉండగా, 2022 చివరికి ఇది 735 మెగావాట్లకు చేరొచ్చు. ప్రస్తుతం డేటా కేంద్రాలు అధికంగా ముంబయిలో ఉన్నాయి. డేటా కేంద్రాలను అధికంగా స్థాపించాల్సి ఉన్నందున, వాణిజ్య స్థిరాస్తికి ఈ విభాగం నుంచి గిరాకీ ఇంకా పెరుగుతుంది.
  • రీట్‌ (రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌) పెట్టుబడులకు రిటైల్‌ మదుపరులు ఆసక్తి చూపుతున్నందున భారతీయ రియల్‌ ఎస్టేట్‌ రీట్స్‌ మార్కెట్‌ బాగా విస్తరించే అవకాశం ఉంది.

మరిన్ని అంతర్జాతీయ సంస్థలు వస్తున్నాయ్‌

Flex office space rates: 'ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను మళ్లీ కార్యాలయాలకు రమ్మంటున్నాయి. భారీగా కొత్త నియామకాలు చేపట్టడం వల్ల ఆఫీసు స్థలానికి గిరాకీ పెరుగుతోంది' అని నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా ఛైర్మన్‌, ఎండీ శిశిర్‌ బజాజ్‌ పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా సేవల విభాగంలో నిమగ్నమైన ఎన్నో కంపెనీలు మనదేశానికి తమ కార్యాకలాపాలు మళ్లించే ఆలోచన చేస్తున్నాయని, ఇప్పటికే ఇక్కడ ఉన్న కంపెనీలు తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నాయని పేర్కొన్నారు. దీనివల్ల దేశీయ స్థిరాస్తి విపణి కరోనా పరిణామాల ప్రభావం నుంచి త్వరగా బయటపడి, వృద్ధి బాట పడుతోందని వివరించారు.

ఇదీ చూడండి:Algo trading: రిటైల్‌ మదుపర్ల కోసం అల్గో ట్రేడింగ్‌

ABOUT THE AUTHOR

...view details