దేశంలో కరోనాతో నెలకొన్న సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుని ప్రభుత్వం ఆరోగ్య రంగంపై భారీగా పెట్టుబడులు పెట్టాలని ఆర్థిక వేత్తలు సూచిస్తున్నారు. అదే విధంగా 2023 నాటికి దేశంలో మురికి వాడలు లేని పట్టణాలు రూపొందించడం ప్రభుత్వం ధ్యేయంగా పెట్టుకోవాలని అంటున్నారు.
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ నిర్వహించిన ఆర్థిక సదస్సులో ఈ విషయంపై చర్చించారు ఆర్థికవేత్తలు, నిపుణులు.
చరిత్రలో భారత్ ఎప్పుడు ఆరోగ్య రంగంపై భారీగా పెట్టుబడులు పెట్టలేదని యేల్ యూనివర్సిటీ ప్రతినిధి రోహిణి పాండే అన్నారు. ఇప్పుడు కూడా అందులో పెట్టుబడులు పెద్దగా పెరగటం లేదని అన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం గ్రహించాలన్న ఆమె.. ఆర్థిక వృద్ధి పునరుద్ధరణకు ఇది ఎంతో అవసరమని చెప్పుకొచ్చారు.