తెలంగాణ

telangana

ETV Bharat / business

2019-20 క్యూ4లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అదుర్స్‌ - కరోనా వార్తలు

ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 2019-20 చివరి త్రైమాసికంలో (జనవరి-మార్చి) రూ.7,280.22 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతకుముందు అర్థిక సంవత్సరం (2018-19) క్యూ4తో పోలిస్తే గడిచిన ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో లాభం 15.4 శాతం పెరిగినట్లు బ్యాంకు వెల్లడించింది.

hdfc bank
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్

By

Published : Apr 18, 2020, 6:15 PM IST

గడిచిన ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ భారీ లాభాలను గడించింది. క్యూ4 చివర్లో కరోనా సంక్షోభం వచ్చినా నికర లాభం.. 15.4 శాతం వృద్ధితో రూ.7,280.22 కోట్లుగా నమోదైనట్లు బ్యాంకు ప్రకటించింది.

అంతకు ముందు ఆర్థిక సంవత్సరం(2018-19) చివరి త్రైమాసికంలో బ్యాంకు నికర లాభం 6,300.81 కోట్లుగా ఉంది.

ఆదాయంలోనూ భారీ వృద్ధి..

2018-19 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2019-20లో బ్యాంకు ఆదాయం రూ.33,260.48 కోట్ల నుంచి రూ.38,287.17 కోట్లకు పెరిగింది.

ఇదే సమయానికి బ్యాంకు నికరలాభం రూ.5,885.12 కోట్ల నుంచి 17.7 శాతం వృద్ధితో రూ.6,927.69 కోట్లుగా నమోదైంది. ఆదాయం 31,204.46 కోట్ల నుంచి రూ.35,917.63 కోట్లకు పెరిగింది.

ఇదీ చూడండి:మే 4 నుంచి ఎయిర్ ‌ఇండియా విమాన సేవలు

ABOUT THE AUTHOR

...view details