తెలంగాణ

telangana

ETV Bharat / business

హెచ్​డీఎఫ్​సీ బ్యాంకుకు లాభాల పంట - BANK

దిగ్గజ ప్రెవేటు బ్యాంకు హెచ్​డీఎఫ్​సీ.. గత ఆర్థిక సంవత్సర చివరి త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. అంతకుముందటి ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే 23 శాతం పెరుగుదల కనిపించింది.

హెచ్​డీఎఫ్​సీ బ్యాంకుకు లాభాల పంట

By

Published : Apr 20, 2019, 7:38 PM IST

గత ఆర్థిక సంవత్సర చివరి త్రైమాసికమైన జనవరి-మార్చిలో హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు భారీ లాభాలు అర్జించింది. మార్చితో ముగిసిన 2018-19 నాలుగో త్రైమాసికంలో బ్యాంకు రూ. 5,885.12 కోట్ల నికరలాభం నమోదు చేసింది. 2017-18లో ఇదే కాలానికి వచ్చిన నికరలాభం రూ.4,799.28 కోట్లతో పోలిస్తే ఇది 23 శాతం అధికం.

వడ్డీల రూపంలో వచ్చిన ఆదాయం 22.8 శాతం పెరిగి రూ. 13వేల 89 కోట్లకు చేరుకుంది. 2017-18 చివరి త్రైమాసికంలో ఇది రూ.10వేల 657గా ఉంది.

2018-19 సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో బ్యాంకు ఆదాయం రూ. 31వేల 204 కోట్లకు చేరింది. 2017-18లో అదే త్రైమాసికంతో పోల్చితే ఇది 22.1 శాతం వృద్ధితో సమానం.

ABOUT THE AUTHOR

...view details