తెలంగాణ

telangana

ETV Bharat / business

ఫ్రెషర్స్​కు శుభవార్త.. 20వేల ఉద్యోగాలకు రంగం సిద్ధం! - హెచ్​సీఎల్ టెక్ ఉద్యోగాలు

ఫ్రెషర్స్​కు శుభవార్త! 20వేల ఉద్యోగ నియామకాలకు ప్రముఖ ఐటీ సంస్థ హెచ్​సీఎల్ టెక్​ స​న్నద్ధమవుతోంది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్టు సంస్థ చెప్పడం మరో విశేషం.

IT jobs, hcl tech
ఐటీ జాబ్స్, హెచ్​సీఎల్ టెక్

By

Published : Jul 20, 2021, 7:03 AM IST

ఐటీ రంగంలో పనిచేయాలనే ఆశావహులకు శుభవార్త. ప్రముఖ ఐటీ సంస్థ హెచ్​సీఎల్ టెక్నాలజీస్ కొత్తగా 20,000 నుంచి 22,000 ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ ఉద్యోగాలు ఫ్రెషర్స్​కే ఇవ్వనున్నట్లు పేర్కొంది. గతేడాదితో పోల్చితే.. 21-2022లో 50 శాతం ఎక్కువగా ఉద్యోగాలిస్తుండటం గమనార్హం.

జులై 19న సంస్థ హ్యూమన్​ రిసోర్సెస్ ఛీఫ్ వీవీ అప్పారావు ఉద్యోగావకాశాలపై ప్రకటన చేశారు. 'గతేడాది 14,600 మంది ఫ్రెషర్లకు ఉద్యోగాలిచ్చాం. ఈ ఏడాది 20-22 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించనున్నాం. ఈ సంఖ్య పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు,' అని అప్పారావు అన్నారు.

70 శాతం మందికి వ్యాక్సినేషన్...

హెచ్​సీఎల్​ టెక్ సంస్థ ఇప్పటికే 70శాతం మంది ఉద్యోగులకు వ్యాక్సినేషన్​ పూర్తి చేసింది. ఈ త్రైమాసికంలో ఉద్యోగులందరికీ టీకా వేయించనుంది. ప్రస్తుతం 3శాతం ఉద్యోగులు సంస్థలో పనిచేసేందుకు ఆఫీసులకు వెళ్తున్నారు. ఈ సంఖ్య క్రమంగా పెరుగుతోందని హెచ్​సీఎల్ టెక్ పేర్కొంది.

ఇదీ చదవండి:Job alert: ఐటీ రంగంలో ఈ ఏడాది భారీగా కొలువులు!

ABOUT THE AUTHOR

...view details