తెలంగాణ

telangana

ETV Bharat / business

రూ.50 కోట్ల టర్నోవరు ఉంటేనే ఈ-బిల్లు! - జీఎస్టీ మండలి

వస్తు, సేవల పన్ను-జీఎస్టీ మండలి ఈనెల 20న సమావేశం కానుంది. ఈ-ఇన్​వాయిస్​లు ఇచ్చే సంస్థల కనీస టర్నోవరును రూ.50కోట్లకు పరిమితం చేయడంపై నిర్ణయం తీసుకోనుంది. ఈ విధానం అమల్లోకి వస్తే జీఎస్టీ ఎగవేతకు అడ్డుకట్ట వేయొచ్చని కేంద్రం భావిస్తోంది.

జీఎస్టీ

By

Published : Jun 9, 2019, 1:34 PM IST

వస్తు సేవల పన్ను(జీఎస్టీ)లో కొన్ని మార్పులకు ఆర్థిక మంత్రిత్వ ప్రతిపాదనలు చేయనుంది. బిజినెస్​-టూ-బిజినెస్​ అమ్మకాల్లో ఈ-ఇన్​వాయిస్​ ఇచ్చే సంస్థ కనీస టర్నోవరును రూ.50 కోట్లకు పరిమితం చేయాలని కోరుతోంది. ఈ విషయమై జూన్​ 20న సమావేశమయ్యే జీఎస్టీ మండలి తుది నిర్ణయం తీసుకోనుంది.

2017-18లో రిటర్న్​ దరఖాస్తులను పరిశీలిస్తే.... 68,041 సంస్థలు రూ.50 కోట్లకన్నా ఎక్కువ టర్నోవరు ఉన్నట్లు తెలిపాయి. జీఎస్టీ ఆదాయంలో 66.66 శాతం వాటా ఈ సంస్థల నుంచి వచ్చిందే. జీఎస్టీ చెల్లింపుదారుల సంఖ్యపరంగా పెద్ద సంస్థలు 1.02శాతమే. అయితే... 30శాతం ఈ-ఇన్​వాయిస్​లను ఈ సంస్థలే ఇస్తున్నాయి.

పన్ను ఎగవేతకు అడ్డుకట్ట

ప్రస్తుత విధానంలో అమ్మకం నమోదు, రిటర్న్​ దాఖలుకు మధ్య చాలా సమయం పడుతోంది. కొత్త పద్ధతి అమల్లోకి వస్తే రిటర్న్​ దాఖలు, ఇన్​వాయిస్​ అప్​లోడ్​ శ్రమ తగ్గుతుంది.

ప్రభుత్వపరంగా చూస్తే పన్ను ఎగవేత, ఇన్​వాయిస్​ల దుర్వినియోగాన్ని తగ్గించవచ్చు. సులభతర వాణిజ్యానికి ఈ-ఇన్​వాయిస్​ మరింత దోహదం చేస్తుంది. సెప్టెంబర్​లోపు ఈ విధానాన్ని ప్రవేశపెట్టాలని ఆర్థిక శాఖ భావిస్తోంది.

ఇదీ చూడండి: 'ఆర్​బీఐ నిబంధనలకు అనుగుణంగానే నెఫ్ట్'

ABOUT THE AUTHOR

...view details