తెలంగాణ

telangana

ETV Bharat / business

కరోనా ఉత్పత్తులపై నేడు జీఎస్​టీ మండలి నిర్ణయం - కరోనా వ్యాక్సిన్ జీఎస్​టీ

నేడు జీఎస్​టీ మండలి సమావేశం కానుంది. ఇందులో కరోనా వ్యాక్సిన్​, ఔషధాలు, వైద్యపరికరాలపై పన్ను తగ్గింపు విషయంపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సమావేశానికి అన్నీ రాష్ట్రాల నుంచి ప్రతినిధులు పాల్గొంటారు.

nirmala seetharaman, gst
నిర్మలా సీతారామన్‌

By

Published : May 28, 2021, 5:15 AM IST

కొవిడ్‌ ఔషధాలు, వ్యాక్సిన్లు, వైద్య పరికరాలపై వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) తగ్గింపు, రాష్ట్రాలకు ఆదాయం తగ్గిన నేపథ్యంలో అధిక పరిహారం చెల్లింపు వంటి అంశాలపై చర్చించేందుకు జీఎస్‌టీ మండలి శుక్రవారం సమావేశం కాబోతోంది. సుమారు 8 నెలల తర్వాత జరుగుతున్న సమావేశమిది.

ఇందులో భాజపా యేతర పాలిత రాష్ట్రాల (రాజస్థాన్‌, పంజాబ్‌, చత్తీస్‌గఢ్‌, తమిళనాడు, మహారాష్ట్ర, ఝార్ఖండ్‌, కేరళ, పశ్చిమ బెంగాల్‌) ఆర్థిక మంత్రులు సంయుక్త వ్యూహాన్ని అనుసరించాలని, కొవిడ్‌ అత్యవసరాలపై జీఎస్‌టీ లేకుండా (జీరో ట్యాక్స్‌) చూడాలని కోరబోతున్నారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆధ్వర్యంలో జీఎస్‌టీ మండలి సమావేశం జరగబోతోంది. ఇందులో అన్ని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతినిధులు పాల్గొంటారు.

ABOUT THE AUTHOR

...view details