వస్తు సేవల పన్నును తగ్గించాలన్న డిమాండ్‌ల నడుమ జీఎస్టీ కౌన్సిల్ 37వ సమావేశం వచ్చే శుక్రవారం (సెప్టెంబర్ 20)గోవాలో జరగనుంది. ఆదాయం దృష్టిలో ఉంచుకుని... కార్ల నుంచి బిస్కెట్ల వరకు పలు ఉత్పత్తులపై పన్ను తగ్గింపు అంశం సమావేశంలో చర్చకు రానుందని సమాచారం.
పన్నుల్లో కోత ఉంటే రాష్ట్రాల ఆదాయాలపై పడే ప్రభావంపైనా చర్చించనుంది కౌన్సిల్. జీఎస్టీ రేట్లను మరింత తగ్గించడం ద్వారా దేశీయ వినియోగాన్ని పెంచవచ్చన్న వాదన వినిపిస్తోంది. అయితే పలు రంగాల్లో మందగమనం కేవలం వ్యవస్థీకృత సమస్యల వల్లే వచ్చిందని దానికి జీఎస్టీ కారణం కాదని రాష్ట్రాలు ఇప్పటికే భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు.