తెలంగాణ

telangana

ETV Bharat / business

విదేశాల్లోని అక్రమాస్తులపై దర్యాప్తునకు ప్రత్యేక విభాగం - undisclosed foreign assets special unit

భారతీయులు విదేశాల్లో దాచుకునే నల్లధనం, అక్రమాస్తుల కేసుల విచారణ కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది ఆదాయ పన్ను శాఖ. దీని కోసం మొత్తం 69 మంది ఐటీ అధికారులను సీబీడీటీ కేటాయించింది.

Govt creates special unit in I-T dept for probe into undisclosed foreign assets
విదేశాల్లో నల్లధనం, అకమాస్తుల దర్యాప్తునకు ప్రత్యేక ఐటీ విభాగం

By

Published : Jan 10, 2021, 7:32 PM IST

కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయులు విదేశాల్లో కలిగి ఉండే అక్రమాస్తులు, నల్లధనం కేసుల విచారణ కోసం ఆదాయ పన్ను శాఖలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది.

ద ఫారెన్​ అసెట్ ఇన్వెస్టిగేషన్ యూనిట్స్​(ఎఫ్​ఏఐయూ)ను నెలకొల్పేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ గతేడాది నవంబర్​లో ఆమోదం తెలిపినట్లు సీనియర్ అధికారి తెలిపారు. ఆదాయ పన్ను శాఖలోని 69మంది అధికారులను ప్రత్యేక విభాగానికి బదిలీ చేసినట్లు పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా ఐటీ శాఖకు చెందిన 14 ఇన్వెస్టిగేషన్ డెరెక్టరేట్లలో ఎఫ్​ఏఐ యూనిట్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు చెప్పారు.

పన్ను పారదర్శకత, మనీ లాండరింగ్​, ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక సాయం, పన్ను ఎగవేత వంటి అక్రమాలను నిలువరించేందుకు ప్రపంచ దేశాలు పరస్పరం పన్ను సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటున్నాయని మరో అధికారి తెలిపారు. ఆర్గనైజేషన్​ ఫర్ ఎకనామిక్​ కో-ఆపరేషన్​ అండ్​ డెవలప్​మెంట్​(ఓఈసీడీ) నిర్దేశించిన అంతర్జాతీయ ప్రోటోకాల్స్​ను పాటిస్తున్నట్లు చెప్పారు.

ఇదీ చూడండి: పన్నురేట్లను తగ్గిస్తేనే.. ఆర్థిక వ్యవస్థకు పునరుజ్జీవం!

ABOUT THE AUTHOR

...view details