ఆహారశుద్ధి పరిశ్రమలకు కేంద్రం ప్రోత్సాహకాలు విడుదల చేసింది. మొత్తం రూ.10,900 కోట్లు కేటాయించింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర కేబినెట్ ఇందుకు ఆమోదం తెలిపింది.
దీని ద్వారా 2.5లక్షల ఉద్యోగ అవకాశాలు సృష్టించవచ్చని ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఇది రైతులకు మేలు చేసే గొప్ప నిర్ణయమని చెప్పారు. ఎగుమతులకు ఊతం లభిస్తుందని, వినియోగదారులకు విలువ ఆధారిత ఉత్పత్తులు లభ్యమవుతాయని పేర్కొన్నారు.