తెలంగాణ

telangana

ETV Bharat / business

'ఆర్థిక సంఘానికి శాశ్వత హోదా ఇచ్చే ఆలోచన లేదు'

ఆర్థిక సంఘానికి శాశ్వత హోదా ఇచ్చే ఆలోచనేమీ ప్రభుత్వానికి లేదని లోక్​సభలో స్పష్టం చేశారు కేంద్ర మంత్రి అనురాగ్​ ఠాకూర్. ఆర్​బీఐ కూడా ఈ ప్రతిపాదనను పరిగణించడంలేదని ఆయన పేర్కొన్నారు.

Anurag Thakur
అనురాగ్​ ఠాకూర్

By

Published : Feb 10, 2020, 4:45 PM IST

Updated : Feb 29, 2020, 9:23 PM IST

ఆర్థిక సంఘానికి శాశ్వత హోదా ఇచ్చే ఆలోచన ప్రభుత్వానికి లేదని కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్​ సింగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. అలాంటి ప్రతిపాదనను రిజర్వ్​ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్​బీఐ) కూడా పరిగణించడంలేదని ఆయన అన్నారు.

ప్రస్తుతం, కేంద్ర ప్రభుత్వం ఓ నిర్ణీత కాలానికి ఫైనాన్స్ కమిషన్​ను నియమిస్తోంది. అయితే ఈ కమిషన్​కు శాశ్వత హోదా ఇచ్చే ప్రతిపాదన ఉందా? అని లోక్​సభలో అడిగిన ప్రశ్నకు... 'లేదు' అని మంత్రి అనురాగ్​ ఠాకూర్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

ఫైనాన్స్ కమిషన్ విధులు

ఫైనాన్స్ కమిషన్ ప్రధాన విధులు... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక స్థితిగతులను అంచనా వేయడం, వాటి మధ్య పన్నుల పంపిణీకి సిఫారసు చేయడం, రాష్ట్రాల మధ్య ఈ పన్నుల పంపిణీని నిర్ణయించే సూత్రాలను నిర్దేశించడం.

కమిషన్ పదవీకాలం పొడిగింపు..

మాజీ బ్యూరోక్రాట్​ ఎన్​.కె.సింగ్ నేతృత్వంలోని 15వ ఫైనాన్స్ కమిషన్ పదవీకాలం వాస్తవానికి 2019 అక్టోబర్​లోనే ముగియాల్సింది. అయితే దానిని నవంబర్ 30 వరకు పొడిగించింది. కేంద్ర ప్రభుత్వం మళ్లీ ఇప్పడు ఈ కమిషన్​ పదవీ కాలాన్ని 2020 అక్టోబర్ 30 వరకు పొడిగించింది.

ఎన్​.కె.సింగ్ నేతృత్వంలోని ఫైనాన్స్ కమిషన్..​ 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తన మొదటి నివేదికను 2019 డిసెంబర్​లో కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఫైనాన్స్ కమిషన్ చేసిన ఈ సిఫారసులను ఆర్థిక మంత్రిత్వశాఖ పరిశీలిస్తుందని, వివిధ విభాగాలతో సంప్రదించి ఓ నిర్ణయం తీసుకున్న తరువాత దానిని కేబినెట్ ఆమోదానికి పంపుతామని అనురాగ్ ఠాకూర్ తెలిపారు. కేబినెట్ ఆమోదం తరువాత దానిని పార్లమెంట్ ఉభయసభల ముందు ఉంచుతామని ఆయన స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు

Last Updated : Feb 29, 2020, 9:23 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details