తెలంగాణ

telangana

ETV Bharat / business

గూగుల్ నుంచి 'ఒరిజినల్​ ఆలు చిప్స్'​- మీకూ కావాలా? - జపాన్​లో గూగుల్ ప్రమోషన్స్​

త్వరలో తీసుకురానున్న పిక్సెల్​ 6 సిరీస్(Google Pixel 6)​ ఫోన్​తోపాటు దాని 'గూగుల్​టెన్సార్ చిప్​​'​ ప్రమోషన్ కోసం విభిన్నంగా ప్రయత్నించింది గూగుల్. ఆలు చిప్స్​ ప్యాకేజీలను వినియోగదారుల కోసం అందుబాటులోకి తెచ్చింది. మరి ఈ ఆలు చిప్స్​ ఎక్కడ దొరుకుతాయి? వాటి టేస్ట్ ఎలా ఉంటుందంటే..?

google original chips
గూగుల్ ఒరిజినల్ చిప్స్​

By

Published : Sep 20, 2021, 12:30 PM IST

ఏ కంపెనీ అయినా.. తమ ఉత్పత్తిని మార్కెట్లోకి తెచ్చే విషయంలో ప్రమోషన్లు చేయడం అత్యంత ప్రధాన అంశంగా భావిస్తాయి. అందుకోసం వివిధ రకాలుగా ప్రయత్నించి, ప్రజల దృష్టిని తమ వైపు మరల్చేలా చేస్తాయి. ఇదే తరహాలో గూగుల్​ సంస్థ కూడా.. త్వరలో తీసుకురానున్న పిక్సెల్​​ 6 సిరీస్​ ఫోన్​తో(Google Pixel 6) పాటు దాని 'గూగుల్​ టెన్సార్ చిప్' ​​ కోసం విభిన్నంగా ప్రయత్నించింది. అసలేం చేసిందంటే..?

పిక్సెల్​ 6 సిరీస్​ ఫోన్(Google Pixel 6)​ కోసం తీసుకువస్తున్న గూగుల్ టెన్సార్ చిప్​సెట్​ ప్రమోషన్​​ కోసం 'గూగుల్ ఒరిజినల్ చిప్స్​' పేరుతో.. ఆలు చిప్స్​ను​ మార్కెట్లోకి తీసుకువచ్చింది. అయితే.. ఈ చిప్స్​ మన దగ్గర కాదండోయ్​! జపాన్​లో మాత్రమే. అంతేకాదు.. ఈ ఆలు చిప్స్​ కోసం గూగుల్​ ప్రత్యేక వెబ్​సైట్​ను కూడా తెరిచింది. అక్కడ వినియోగదారులు తమకు చిప్స్​ కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు.

అయితే... ఈ ఆలు చిప్స్​ ప్యాకేజీలు ఆర్డర్ చేసుకున్న వారందరికీ దొరకవు. ఆర్డర్ చేసుకున్న వారి నుంచి.. లాటరీలో ఎంపికైన 1,000 మందికి మాత్రమే అవి అందుతాయి. అయితే.. జపాన్​లో ఈ చిప్స్​ కోసం సెప్టెంబర్​ 9 నుంచి సెప్టెంబర్ 17 మధ్య 10,000 మంది ఇప్పటికే ఆర్డర్​ చేసుకున్నారు.

గూగుల్ ఒరిజినల్​ చిప్స్​

ఈ ఆలు చిప్స్ టేస్ట్​ ఎలా ఉంటాయ్​?

ఈ గూగుల్ చిప్స్​ 'సాల్టీ ఫ్లేవర్​'​తో ఉంటాయని తెలుస్తోంది. పిక్సెల్​ 6 ఫోన్లు ఉన్న రంగుల్లోనే ఈ చిప్స్ ప్యాకెట్లు కూడా ఉంటాయి. అంతేగాకుండా.. ఈ ఆలు చిప్స్​ కోసం గూగుల్ యూట్యూబ్​లో ఓ ప్రోమో వీడియో కూడా విడుదల చేసింది.

మరి గూగుల్ టెన్సార్ చిప్​ సంగతేంటి?

ఈ గూగుల్ టెన్సార్ చిప్​ ఆ సంస్థ నుంచి వస్తున్న మొదటి ఇన్​-హౌస్​ సిస్టమ్​ ఆన్ చిప్​(ఎస్ఓసీ). గూగుల్ దీని గురించి ఇంకా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. అయితే.. మరి మీరు కూడా ఈ గూగుల్​ చిప్స్​ను తినాలని ఆశపడుతున్నారా? కానీ, మీకు ఆ ఛాన్స్​ లేదు. ఎందుకంటే.. గూగుల్​ ప్రమోషనల్ క్యాంపెయిన్ సెప్టెంబర్​ 17తోనే ముగిసింది.

ఇదీ చూడండి:గూగుల్​కు రూ.1300 కోట్ల జరిమానా!

ABOUT THE AUTHOR

...view details