తెలంగాణ

telangana

ETV Bharat / business

తగ్గిన బంగారం ధర.. 10 గ్రాములు ఎంతంటే?

బంగారం, వెండి ధరలు నేడు తగ్గాయి. 10 గ్రాముల మేలిమి పసిడి ధర రూ.232 క్షీణించింది. వెండి కిలోకు స్వల్పంగా రూ.7 తగ్గింది.

By

Published : Dec 13, 2019, 4:38 PM IST

Gold tumbles Rs 232 on stronger rupee
బంగారం ధరలు

బంగారం ధరల వృద్ధికి నేడు అడ్డుకట్టపడింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర నేడు రూ.232 తగ్గింది. ప్రస్తుత ధర రూ.38,486కి చేరింది.

దేశీయంగా డిమాండు లేమికి తోడు డాలర్​తో పోలిస్తే రూపాయి విలువ పుంజుకోవడం పసిడి ధర తగ్గుదలకు కారణమని నిపుణులు చెబుతున్నారు.

బంగారం ధర భారీగా క్షీణించినా వెండి మాత్రం స్వల్పంగా.. రూ.7 తగ్గింది. కిలో వెండి ధర నేడు (దిల్లీలో) రూ.45,189కి చేరింది.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1,470 డాలర్లకు పెరిగింది. వెండి ఔన్సుకు 16.93 డాలర్ల వద్ద ఉంది.

ఇదీ చూడండి:గుడ్​ న్యూస్​: బ్రాండెడ్ కార్లపై బంపర్​ ఆఫర్స్​!

ABOUT THE AUTHOR

...view details