పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు తగ్గుముఖం పట్టటం సహా.. రూపాయి మారకం విలువ బలపడటం వల్ల వరుసగా రెండో రోజు బంగారం ధరలు తగ్గాయి. దిల్లీలో నేడు 10 గ్రాముల పసిడి రూ.80 పతనమై రూ.40,554కి చేరింది.
వరుసగా రెండో రోజు దిగొచ్చిన బంగారం ధర - బంగారం ధరలు
రూపాయి బలపడటం సహా అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో దిల్లీలో బంగారం ధర వరుసగా రెండో రోజు దిగొచ్చింది. దిల్లీలో నేడు 10 గ్రాముల పుత్తడి రూ.80 క్షీణించి రూ.40,554కి చేరింది. వెండి ధర రూ.200 తగ్గింది
స్వల్పంగా తగ్గుముఖం పట్టిన బంగారం ధర
బంగారం దారిలోనే వెండి కూడా దిగొచ్చింది. దిల్లీలో నేడు కిలో వెండి రూ.200 తగ్గి రూ.47,695కి చేరింది.
పెద్ద ఈక్విటీల కొనుగోలులో నష్టభయాలు వెంటాడటం వల్ల బంగారం ధరలు స్వల్పంగా దిగొచ్చినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.