బులియన్ మార్కెట్లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. దిల్లీలో 10 గ్రాముల బంగారం రూ.497 తగ్గి రూ.38,685కు చేరుకుంది. దిల్లీలో కిలో వెండి రూ.1,580 తగ్గి... రూ.47,235కు పడిపోయింది.
అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధరలు తగ్గాయి. ఔన్స్ బంగారం 1,508 డాలర్లుగా ఉంది. ఔన్స్ వెండి ధర 17.90 డాలర్లుగా ఉంది.
కారణం ఇది...
అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం నేపథ్యంలో ఇప్పటివరకు మదుపర్లు బంగారంపై పెట్టుబడులు పెట్టేందుకే మొగ్గుచూపారు. చైనాతో త్వరలోనే వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశముందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో మదుపర్ల వైఖరిలో మార్పు వచ్చిందన్నది నిపుణుల మాట.
"ఇవాళ బంగారం ధరలు బాగా తగ్గాయి. పండుగ సీజన్‌కు ముందు బంగారం ధరల దిద్దుబాటు సహజమే. ఇదే బంగారం డిమాండ్‌ను పెంచుతుంది."
- దేవర్ష్ వికిల్, అడ్వైజరీ, హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్
ఇదీ చూడండి: 'మాంద్యం ముప్పు పొంచి ఉంది.. బ్రహ్మాస్త్రమూ ఉంది'