తెలంగాణ

telangana

ETV Bharat / business

స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు - దిల్లీలో బంగారం ధరలు

బంగారం, వెండి ధరలు శుక్రవారం స్వల్పంగా తగ్గాయి. దిల్లీలో 10 గ్రాముల పసిడి ధర రూ.43 తగ్గింది. కిలో వెండి ధర సైతం రూ.36 తగ్గింది.

Gold, silver marginally down
స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

By

Published : Nov 27, 2020, 5:29 PM IST

దేశ రాజధాని దిల్లీలో బంగారం, వెండి ధరలు శుక్రవారం స్వల్పంగా తగ్గాయి. 10 గ్రాముల పసిడి ధర రూ.43 తగ్గి ప్రస్తుతం రూ.48,142 వద్దకు చేరింది. కిలో వెండి ధర రూ.36 తగ్గి రూ.59,250గా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్లలో మాత్రం పసిడి ధర పెరిగింది. ఔన్సు బంగారం ధర 1,810 డాలర్లకు చేరింది. వెండి ధర ఔన్సుకు 23.29 డాలర్ల వద్ద స్థిరంగా ఉంది.

కరోనా వ్యాక్సిన్ పురోగతిపై అనుమానాల నేపథ్యంలో అంతర్జాతీయ మదుపర్లు ఆచితూచి వ్యవహరించడం వల్ల బంగారం, వెండి ధరలు పెరిగినట్లు హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​ సీనియర్​ అనలిస్ట్​ తపన్ పటేల్​ తెలిపారు.

ఇదీ చదవండి:టీసీఎస్​ వ్యవస్థాపకులు ఎఫ్​.సి. కోహ్లీ కన్నుమూత

ABOUT THE AUTHOR

...view details