తెలంగాణ

telangana

ETV Bharat / business

మరింత ప్రియమైన బంగారం.. ప్రస్తుత ధరెంతంటే...

పసిడి, వెండి ధరలు నేడు మరింత ప్రియమయ్యాయి. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.43 పెరిగింది. వెండి కిలోకు రూ.209 పుంజుకుంది.

gold
బంగారం ధర

By

Published : Jan 16, 2020, 4:52 PM IST

బంగారం ధర నేడు మళ్లీ పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.43 పెరిగి.. రూ.40,458కి చేరింది.

రూపాయి బలహీనపడటం, అంతర్జాతీయంగా కొనుగోళ్లు పుంజుకోవడం వంటి పరిణామాలతో దేశీయంగా పసిడి ధరలు పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు.

బంగారంతో పాటే వెండి ధర నేడు పుంజుకుంది. కిలో వెండి ధర నేడు రూ.209(దిల్లీలో) పెరిగి.. రూ.47,406 వద్దకు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1,553 డాలర్ల వద్ద.. వెండి ఔన్సుకు 17.83 డాలర్ల వద్ద ఫ్లాట్​గా ఉన్నాయి.

ఇదీ చూడండి:'ఆన్​-ఆఫ్'తో డిజిటల్​ లావాదేవీలు మరింత సురక్షితం!​

ABOUT THE AUTHOR

...view details