తెలంగాణ

telangana

ETV Bharat / business

స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు - ప్రస్తుతం బంగారం, వెండి ధరలు

ఇటీవల భారీగా దిగొచ్చిన బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర అతి స్వల్పంగా రూ.3 పెరిగింది. వెండి ధర మళ్లీ రూ.62 వేల పైకి చేరింది.

TODAY GOLD AND SILVER PRICE
బంగారం, వెండి ధరలు

By

Published : Nov 11, 2020, 4:49 PM IST

బంగారం ధర బుధవారం మళ్లీ పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి అతి స్వల్పంగా రూ.3 పెరిగి.. రూ.50,014 వద్దకు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్ ధరలకు తగ్గట్లు దేశీయంగానూ పసిడి అస్థిరతను ఎదుర్కొన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

వెండి ధర కూడా కిలోకు రూ.451 పెరిగింది. కిలో ధర ప్రస్తుతం రూ.62,023 వద్ద ఉంది.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర స్వల్పంగా పెరిగి 1,877 డాలర్లకు చేరింది. వెండి ధర ఔన్సుకు 24.20 డాలర్ల వద్ద దాదాపు ఫ్లాట్​గా ఉంది.

ఇదీ చూడండి:ఎల్​టీసీ క్యాష్ ఓచర్​పై కేంద్రం మరింత స్పష్టత

ABOUT THE AUTHOR

...view details