బంగారం ధర సోమవారం కూడా స్వల్పంగా పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.277 ఎగిసి.. రూ.52,183 వద్దకు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి డిమాండ్ ఇటీవల భారీగా పెరుగుతూ వస్తోంది. ఈ కారణంగా దేశీయంగాను పుత్తడి ధరలు పెరుగుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. కరోనా వైరస్ రెండో దశ విజృంభణ భయాలతో పెరుగుతున్న కొనుగోళ్లు కూడా బంగారం ధరల్లో వృద్ధికి కారణమని అంటున్నారు.