తెలంగాణ

telangana

ETV Bharat / business

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు - పది గ్రాముల బంగారం ధర

బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 10 గ్రాముల బంగారం ధర గురువారం దాదాపు రూ.900 ప్రియమైంది. వెండి ధర కిలో మళ్లీ రూ.63 వేల పైకి చేరింది.

Silver price rise
పెరిగిన వెండి ధర

By

Published : Apr 1, 2021, 4:39 PM IST

బంగారం ధర మరింత ప్రియమైంది. 10 గ్రాముల పుత్తడి ధర గురువారం దిల్లీలో రూ.881 పెరిగి.. రూ.44,701 వద్దకు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు రికవరీ అవుతుండటం వల్ల.. దేశీయంగానూ బంగారం ప్రియమవుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

పసిడి బాటలోనే వెండి ధర భారీగా రూ.1,071 పెరిగింది. దీనితో కిలో ధర ప్రస్తుతం రూ.63,256 వద్దకు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్స్​ బంగారం ధర 1,719 డాలర్లకు పెరిగింది. వెండి ధర ఔన్సు 24.48 డాలర్ల వద్ద ఫ్లాట్​గా ఉంది.

ఇదీ చదవండి:వెండిపై పెట్టుబడికి ఇదే సరైన సమయమా?

ABOUT THE AUTHOR

...view details