బంగారం, వెండి ధరలు బుధవారం స్వల్పంగా పెరిగాయి. దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.527 పెరిగి.. రూ.48,589 వద్దకు చేరింది. ఇదివరకు ఈ ధర రూ.48,062గా ఉండేది. అమెరికన్ డాలర్ విలువ క్షీణించడం పసిడి ధర పెరుగుదలకు కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.
పసిడి బాటలోనే వెండి ధర కూడా రూ.1,043 (కిలోకు) పెరిగి రూ.71,755కు చేరింది. ఇదివరకు కిలో వెండి ధర (దిల్లీలో) రూ.70,732 వద్ద ఉండేది.