తెలంగాణ

telangana

ETV Bharat / business

కాస్త ప్రియమైన బంగారం.. నేటి ధరలు ఇవే - వెండి ధరలు

బంగారం, వెండి ధరలు నేడు స్వల్పంగా పుంజుకున్నాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.143 పెరిగింది. వెండి కిలోకు రూ.108 వృద్ధి చెందింది.

GOLD
బంగారం ధరలు

By

Published : Nov 29, 2019, 4:43 PM IST

ఇటీవల వరుసగా తగ్గుతూ వస్తున్న పసిడి ధర నేడు పుంజుకుంది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.143 పెరిగింది. ప్రస్తుత ధర రూ.38,695కు చేరింది.

డాలర్​తో పోలిస్తే.. రూపాయి విలువ తగ్గటం, అంతర్జాతీయ సానుకూలతలు పుత్తడి ధర పెరుగుదలకు కారణమని నిపుణులు అంటున్నారు.

బంగారంతో పాటే వెడి ధర పెరిగింది. కిలో వెండి ధర నేడు (దిల్లీలో) రూ.108 వృద్ధిచెంది.. రూ.45,345కి చేరింది.

అంతర్జాతీయ మార్కెట్​లోనూ పసిడి, వెండి ధరలు పుంజుకున్నాయి. ఔన్సు బంగారం ధర 1,458 డాలర్లకు చేరింది. వెండి ఔన్సుకు 16.92 డాలర్ల వద్ద ఉంది.

ఇదీ చూడండి:ప్రపంచ కుబేరుల్లో 9వ స్థానానికి ముకేశ్ అంబానీ

ABOUT THE AUTHOR

...view details